Varahi Vijaya Yatra : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు. ఏపీ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తూ పలు ఊర్లల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పవన్ ఎక్కువగా సినిమా హీరోల గురించి ప్రస్తావిస్తున్నారు. అందరు హీరోలు ఒకటే, మేమంతా కలిసే ఉంటాం, సినిమా వేరు రాజకీయం వేరు, మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి కానీ రాజకీయంగా ఒక్కటై నాకు సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాజాగా ప్రభాస్ మూవీస్ పై కామెంట్ చేశారు పవన్.
ప్రభాస్ గారు నటించిన లేటెస్ట్ భారీ మూవీస్ ఎలా ఉన్నా.. సరే ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తారని.. ట్యాక్స్ చెల్లిస్తారని, వైఎస్ జగన్ మాత్రం నిజాయితీగా సంపాదించడంటూ విమర్శించారు. ప్రభాస్‌తో ముడిపెడుతూ వైఎస్ జగన్‌పై చేసిన పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే మీటింగ్ లో పవన్ ప్రభాస్ ఫ్యాన్స్ పట్టుకొన్న ఫ్లెక్స్ ఒకటి చూసి ‘ఒక మాట ఒక మార్పు మీతో మేము’ అనే లైన్ చూసి చదివిన పవన్ ప్రభాస్ గారి అభిమానులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
ప్రస్తుతం ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ 450 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రెసెంట్ పవన్ కూడా సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పవన్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రో జూలై 28న విడుదల కానుంది. ఈ మూవీలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటించాడు. 1, 2 రోజుల్లో బ్రో టీజర్ విడుదల కానుంది.