Varahi VijayaYathra : కోనసీమలో వారాహి విజయయాత్ర విజయవంతంగా ముమ్మడివరం చేరుకుంది.ముమ్మిడివరం జనసంద్రమైంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చిన జనసేనానికి జనసేన శ్రేణులు, ప్రజలు జేజేలు పలికారు. ఆడపడుచుల హారతులు, జన సైనికుల పూల వర్షం మధ్య పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో జనసేన నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పోటెత్తారు.
వారాహి రధం నుంచి పవన్ కళ్యాణ్ గారిచ్చే సందేశం వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు వారాహి విజయ యాత్రలో భాగంగా సాయంత్రం గం. 6.15 నిమిషాల ప్రాంతంలో కొమానపల్లిలో బస చేసిన ప్రాంతం నుంచి సభా ప్రాంగణం వరకు వేలాది మంది జన సైనికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే రిసార్ట్ కి వేలాదిగా చేరుకున్న పార్టీ శ్రేణుల నినాదాల హోరులో ర్యాలీ జాతీయ రహదారి పైకి చేరగానే స్థానిక పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు.
నడిమిలంక, నంబర్ రాయి, రాజుపాలెం మీదుగా ర్యాలీ కొనసాగింది. ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున మహిళలు రహదారిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టాడు. ఆడపడుచులు ఇచ్చిన ప్రతి హారతిని స్వీకరించారు. రోడ్ షో ఆద్యంతం తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు, జాతీయ రహదారి నుంచి పెద్ద ముమ్మిడివరంలో ప్రవేశించే ప్రదేశంలో పవన్ కళ్యాణ్ గారి భారీ కటౌట్ తో స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు.
బాణాసంచా పేలుళ్లు, మేళతాళాల మధ్య రహదారికి ఇరువైపులా నిలబడిన పార్టీ శ్రేణులు పూల వర్షంతో వారాహి వేదిక వద్దకు ఆహ్వానం పలికారు. వారాహి సభా ప్రాంగణం చుట్టు పక్కల భవనాలు సైతం జనసేనాని సభకు తరలివచ్చిన జనంతో కిటకిటలాడాయి. పవన్ కళ్యాణ్ గారి రాక సందర్భంగా ముమ్మిడివరం పట్టణ పరిసరాలు మొత్తం స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సభ ముగింపులో కృతజ్ఞత తెలిపారు.
వేలాది మంది జనసైనికుల జయ జయధ్వానాల మధ్య బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారి ర్యాలీకి అంబులెన్స్ ఎదురు రాగా. తన కోసం ఏర్పాటు చేసిన గజమాలను పక్కకు నెట్టి అంబులెన్స్ కు దారి ఇవ్వమంటూ జన సైనికులకు సూచించారు. అంటుబెన్స్ ర్యాలీని దాటి వెళ్లే వరకు ట్రాఫిక్ క్లియర్ చేయమని సూచిస్తూనే ఉన్నారు. దారిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న వారు చేతులెత్తి సమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు.