Varahi VijayaYathra : ఈ నెల 14న ప్రారంభమైన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగింది. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర మొదలుపెట్టిన అప్పటినుంచి ప్రజల నుండి విశేష స్పందన, ఆదరణ ఆయనకు లభించాయి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లో మమేకం కావడానికి పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన చేసి నాయకుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా
సమస్యలు తెలుసుకోవాలి, సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేయాలి అనే గొప్ప సంకల్పంతో వారాహి విజయయాత్రను ప్రారంభించారు. యాత్ర ఎన్నో ప్రజా సమస్యల నడుమ ఆదారాభిమానాల నడుమ విజయవంతంగా సాగింది. నేటి మలికిపురం సభతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దశను ముగించి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు ఈ యాత్రను
విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు చెందిన పీఏసీ సభ్యులు, నియోజక వర్గాల ఇందార్థులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులకు నా హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. యాత్ర సాఫీగా సాగడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లిన రాష్ట్ర
కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్, కమిటీ సభ్యులకి, యాత్ర కోసం ఏర్పాటైన వివిధ కమిటీల సభ్యులకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. వారాహి విజయ యాత్రకి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.