Varahi VijayaYathra : వారాహి విజయయాత్ర భీమవరం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్మి 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది పార్లమెంటు సభ్యలను వైసీపీకి ఇస్తే వీరు చేసింది ఏంటంటే.. రాష్ట్ర పంటగా గంజాయిని చేశారు. . రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని మార్చారు..
ఇది వైసీపీ విశిష్ట పాలన. ఇదే వైసీపీ చేసిన ఆంద్రా అభివృద్ధి, పార్టీ పేరులో యువజన, శ్రామిక రైతు కాంగ్రెస్ గా పెట్టుకున్న వైసీపీ యువజనులకు ఉద్యోగాలను, దూరం చేసింది. శ్రామికులకు ఉపాధి లేకుండా చేసింది. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంది. పార్టీ పేరులోని వర్గాలనే దగా చేసిన వైసీపీ, రాష్ట్రంలోని అన్ని వర్గాల బతుకులను నాశనం చేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
గాంధీ గారు తన జీవిత చరిత్ర రాసిన మై ఎక్స్ పెర్మెంట్స్ విత్ ట్రూత్ (సత్యశోధన) అనే పుస్తకం మాదిరిగా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైతం మై ఎక్స్ టార్సన్స్ ఇన్ ఏపీ స్టేట్ (అస్యతశోధన) పేరుతో పుస్తకం రాయొచ్చు. పూటకో అబద్ధం… రోజుకో నేరం అన్నట్లు సాగుతున్న వైసీపీ పాలనకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాత ఒడిలో ఆడుకుంటూ, యుక్త వయసులోనే సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ బాబును పోలీస్ స్టేషన్లోనే కొట్టి,
లాకప్ లో వేసిన నేర చరిత ఉన్న ముఖ్యమంత్రికి.. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ స్టేషన్లో చితక కొట్టించడం పెద్ద పని కాదు, దానికి ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం లేని వ్యక్తికి ఈ రోజు ఆ శాఖ అధికారులు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి రాష్ట్రంలో నేను పుట్టినందుకు నిజంగా సిగ్గు అనిపిస్తోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.