Varahi VijayaYathra :ముఖ్యమంత్రికి తెలుగు సరిగ్గా పలకడం రాదు. తెలుగు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు చిన్నప్పుడు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే :వారాహికి, వరహికి తేడా తెలియకుండా మాట్లాడారు. తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు ఉచ్చారణ సరిగా రాని నియంత, కంఠకుడు పాలనలో ఉన్నందుకు చింతిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ నీ ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వయోజన సంచార పాఠశాల పథకంలో భాగంగా ఈ ముఖ్యమంత్రికి తెలుగు పదాలు ఎలా పలకాలో నేనే నేర్పిస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
స్కూల్ విద్యార్ధులు పాల్గొన్న కార్యక్రమంలో ఎలా మాట్లాడాలో ఈ ముఖ్యమంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు తిట్టించుకోనిదే నిద్రపోరు. ఆ స్థాయిలో పాడు పనులు చేస్తారు. నేను మంగళగిరిలో చెప్పు చూపించాను అంటే దాని వెనుక చాలా కథ జరిగింది. పోరాటం, ఒత్తిడి తీసుకోనిదే రాజకీయాల్లో మార్పు రాదు.
ధైర్యంగా నిలబడ్డ వాడే రాజకీయాలు చేయగలడు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పోలీస్ వ్యవస్థ అందరూ మనల్ని భయపెడతారు, కేసులు పెడతారు. వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం భయపడే కొద్ది వాళ్లు భయపెడుతూనే ఉంటారు. మనం దైర్యంగా ఎదురు తిరిగితే వాళ్లు సైలెంట్ అయిపోతారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఎందుకు? పింఛన్ ఇవ్వాలన్నా… కుళాయి కనెక్షన్ కావాలన్నా,చివరకు పోలీస్ స్టేషన్ లో చిన్న ఫిర్యాదు చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటే తప్ప నమోదు చేయడం లేదు. నియోజకవర్గంపై ఎమ్మెల్యే గుత్తాధిపత్యం ఏంటి? నియోజకవర్గంలో ఉన్న ఒక కళాశాలకు కస్తూర్బాగాంధీ పేరు తొలగించి ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టుకోవడం ఏంటి? నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే మీరే ఒక కాలేజీ ఏర్పాటు చేసి దానికి మీ తల్లిదండ్రుల పేరు పెట్టుకోండి.
ఎవడు కాదన్నాడు. డిఎన్ఆర్ కాలేజీకి దంతులూరి, గన్నబత్తుల కుటుంబీకులు సొంత ఆస్తులు ఇచ్చేశారు. ఉన్న ఆస్తులను లాక్కోలేదు. సమాజంలో ఇచ్చే గుణాన్ని పెంపొందించాలనే జనసేన పార్టీని స్థాపించాం. రాష్ట్రం, సమాజం బాగుపడాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదు. భీమవరంలో జనసేన జయకేతనం ఎగురవేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.