Varahi VijayaYatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపి ప్రభుత్వం గురించి, జగన్ అక్రమాల,అవినీతిని గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నలను సందించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలను జగన్ ప్రభుత్వం అధికారం పేరుతో ఎలా మోసం చేస్తున్నది బహిర్గతం చేసారు.
అధికారం అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించింది ఎవరు? భవన నిర్మాణ కార్మిక నిధి సొమ్ము కాజేసింది ఎవరు? దళిత వర్గాల 24 సంక్షేమ పథకాలు రద్దు చేసిందెవరు? యువతకు ఉపాధి కల్పించకుండా వారిని రోడ్డున పడేసింది ఎవరు? అని పవన్ జగన్ చిట్టా బయట పెట్టారు. మద్యం ధరలు పెంచి పేదల సొమ్ము దోచుకుంటూ, రాష్ట్ర ప్రజల మధ్య రాజధాని పేరుతో చిచ్చు పెట్టింది ఎవరు?
విశాఖ భూములు కొల్లగొట్టింది ఎవరు? పేద వారి సాయంలో 2.5 లంచం అడిగింది ఎవరు? రైతుల ధాన్యం డబ్బు దోచుకుంది ఎవరు? వెనుకబడిన, దళిత వర్గాలకు ఇసుక కాంట్రాక్టులు దక్కకుండా కేవలం 3 కంపెనీలకు దొచిపెట్టింది ఎవరు? అని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ అవినీతినీ ఎండగట్టారు. శ్రీవారి సొమ్ము కాజేసింది ఎవరు?
కులాల మధ్య చిచ్చు రాజేసి కేసులు పెట్టింది ఎవరు? ఆక్వా రైతులపై కేసులు పెట్టింది ఎవరు?అమాయక ప్రజలకు పథకాల మాటున వారి జీవితాలు మోసం చేస్తుంది ఎవరు ? ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు జగన్ రెడ్డి నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది అంటూ జగన్ రెడ్డి బాగోతాన్ని, ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ బయటపెట్టారు.