Varahi VijayaYatra : అధికార పార్టీ దాష్టికాలు, దౌర్జన్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలను ఎంతో ఓపికగా విన్న జనసేనని, నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జనవాణిలో ప్రజలతో మమేకమయ్యారు పవన్ కళ్యాణ్. జనం మధ్య, జనం గోడు వింటూ, ప్రతి సమస్యను ఓపికగా ఆలకిస్తూ,పరిష్కారానికి భరోసా ఇస్తూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల దాష్టీకాల బాధితులు జయలక్ష్మి బ్యాంకులో డిపాజిట్లు కట్టి దగా పడ్డ రిటైర్డ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, రజకులు, భవన నిర్మాణ కార్మికులు, కరెంటు బిల్లు ముసుగులో ఫించన్ కోల్పోయిన దివ్యాంగులు,టిడ్కో గృహాల బాదితులు, శాసనభ్యుల అరాచకాలకు ఇబ్బందులు పడుతున్న బాధితులు తమ కన్నీటి గాధలు పవన్ కళ్యాణ్ కి విన్నవించుకున్నారు.
ప్రతి ఒక్కరి ఆవేదనను ఆలకించిన పవన్ కళ్యాణ్.. నేనున్నానంటూ జనవాణిలో సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన అందరికీ ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ప్రజా సమస్యలపై గళం విప్పుతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పించన్ కోల్పోయిన దివ్యాంగుడు మాడం శ్రీనివాస్ కి వీల్ చైర్ కొనివ్వడంతో పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ముఖ్యమంత్రి కావాలి సర్ అంటూ నిండు మనసుతో పవన్ కళ్యాణ్ నీ దీవించారు. కాకినాడ పట్టణ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో శనివారం నిర్వహించిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో 50కి పైగా సమస్యలపై పవన్ కళ్యాణ్ అర్జీలు స్వయంగా స్వీకరించారు.