• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Varahi Yatra Pithapuram : పవన్ వారాహి యాత్ర పిఠాపురం సభ ముఖ్యంశాలు ఇవే..

Pawan Kalyan Varahi Yatra..

TrendAndhra by TrendAndhra
July 4, 2023
in Janasena News, Political News
0 0
0
Varahi Yatra
Spread the love

Varahi Yatra Pithapuram : పవన్ వారాహి యాత్ర పిఠాపురం సభ ముఖ్యంశాలు ఇవే..

  • పిఠాపురం రావడం …సాక్ష్యాత్తు దత్తాత్రేయుడు పుట్టిన ఊరికి రావడం నేను చేసుకున్న అదృష్టం…
  • ధర్మపరిరక్షణ, ప్రజాభివృద్ధి, పరివర్తన ఉద్దేశించి యాగం చేసి వారాహి విజయ యాత్ర మొదలుపెట్టాము..
  • దశాబ్దం పాటు నేను నిలబడింది మీ భవిష్యత్తు కోసం…. మీ బిడ్డల భవిష్యత్తు కోసం…
  • పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నాడంటే కార్యకర్తలే నా బలం… నా కడశ్వాస వరకు మీ కోసం పని చేస్తూనే ఉంటాను…
  • శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఈ పిఠాపురం నేల మీద ధర్మపరిరక్షణ అంటే సనాతన ధర్మాన్ని, వేదాలని నేర్చుకుని ఈ నేలపై చాటుతున్న బ్రాహ్మణులకి పాదాభివందనం. అన్నీ మతాలని సమానంగా చూడమని చెప్పిన ఈ నేల గొప్పది..
  • నేను మతపిచ్చి ఉన్నవాడిని కాదు…. ధర్మం వైపు ఉండే వాడిని… హిందూ దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేశారు ఇక్కడ…‌ ఎవరు చేసారు ఇది??? ఎవడో గుర్తింపు కోరుకునే వాడు చేసాడా అనుకున్నాను…కానీ పిచ్చివాళ్ళు చేసారు అని రాష్ట్రమంతటా అదే కథ అల్లారు ఈ వైసీపీ ప్రభుత్వం.
  • వేరే మతస్తులు చేసారు అని దేవాలయాల ధ్వంసం అడ్డుపెట్టుకుని మతకలహాలు సృష్టించే కుట్ర చేసిన ఈ జగన్ రెడ్డి…సనాతన ధర్మాన్ని పాటించే 279 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కడిని కూడా పట్టుకోలదు ఈ చచ్చు ప్రభుత్వం.
  • ఏం చేస్తున్నారు దేవాలయాల ధ్వంసం జరుగుతుంటే అని పోలీసులని ఒంగోలులో అడిగాను. మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి సార్ విచారణ చేయొద్దని పోలీసులు అన్నారు. మతాల మధ్య సయోధ్య చెడగొట్టి చోద్యం చూస్తున్న వైసీపీ.
  • జనసేన ప్రభుత్వం రాగానే 279 దేవాలయాల ధ్వంసం మీద విచారణ మొదలుపెడతాం
  • గొల్లప్రోలు లో కూర్చుని పురప్రముఖులను కలుస్తుంటే వైసీపీ అరాచకాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.
  • తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి ముందు రోడ్ విస్తరణ కోసం ఇళ్ళు కొట్టేస్తే గ్రామసచివాలయ ఉద్యోగిని ఇంటిని కూడా కూల్చేసారు… నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ సమస్య చెప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ ని కలిసినందుకు తన అన్నని చంపేసారు. ఒక్క పోలీసు కూడా మాట్లాడలేదు. ఇది క్రిమినల్స్ కి అడ్డాగా చేసారు. వైజాగ్ ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసారు. గంజాయి రాజ్యం చేసారు.
  • ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చేసారు వైసీపీ వాళ్ళు. 2024 లో జనసేనను గెలిపించండి. ఈ రౌడీ రాజ్యాన్ని తరిమి సురక్షిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చుదిద్దుకుందాం.

Varahi Yatra : పవన్ వారాహి విజయ యాత్ర మొదటి రోజు ముఖ్యాంశాలు ఇవే..

  • లా అండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసారు..ఎంపీని కొడతారు. నిజాయితీపరులైన పోలీసులని ముందు పెట్టి ఈ పరిస్థితిని జనసేన రాగానే చేస్తాం.
  • జనసేన అధికారంలోకి రాగానే పిఠాపురం నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా మారుస్తాం.. పుణ్యక్షేత్రాలు ఉన్న నేల ఇది.
  • తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి అడ్డంగా దోచేసారు. నామరూపాలు లేకుండా పోతారు వైసీపీ వాళ్ళు. జాగ్రత్త..
  • గొల్లప్రోలు గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక.. నీళ్ళు కలుషితమై తీవ్ర అనారోగ్యం ప్రబలుతోంది.

Pawan Kalyan : జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దాం : పవన్ కళ్యాణ్

  • అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి బయట నా చెప్పులు విప్పితే ఎవడో కొట్టేసాడు. వాడు ఎవడో మరి చెప్పులు తిరిగొచ్చేయాలి నావి.
  • శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్షిగా వైసీపీ క్రిమినల్ గాళ్ళని గుడ్డల విప్పించి కొడతాను. అధికారంలోకి రాగానే ఈ గూండా గాళ్ళకి నేనేంటో చూపిస్తా.
  • ప్రశ్నించిన వాళ్ళని పిచ్చివారిని చేసే ఈ ప్రభుత్వాన్ని మట్టిలో వేసి తొక్కుదాం.
  • పిఠాపురం నియోజకవర్గంలో మట్టిని తోలుకొని పోయే వాళ్ళు అడ్డుకున్న వాళ్ళని తుపాకులతో బెదిరిస్తున్నారు కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు.
  • షణ్ముఖ వ్యూహంతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి జనసేన ప్రభుత్వం రావాలి.
  • క్రిమినల్స్ ని ఎన్నుకుంటే తుపాకులే తీస్తారు, దౌర్జన్యం చేస్తారు.
  • సిల్క్ రైతుల కోసం నేను వెళ్తుంటే వాళ్ళని బెదిరించి ఆపేసే చర్యలు చేసారు.
  • పబ్లిక్ పాలసీలని అర్థం చేసుకున్న వాడిని, మొదటిసారి అడుగుతున్నాను.. “ముఖ్యమంత్రి కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంపూర్ణంగా నాకు అధికారం ఇవ్వండి. ముఖ్యమంత్రిని చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాను”
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యతలు తీసుకోడానికి సంసిద్ధంగా ఉన్నాను.
  • నాణ్యమైన కరెంట్ అని చెప్పి 10 నిముషాలకు ఒకసారి కరెంట్ తీస్తున్నాడు…ఇది ఈ యెదవ పాలన..

– Rahul Rayavarapu


Spread the love
Tags: AadipurushAdipurushReviewPawan KalyanVarahiVarahi for Election BattleVarahi Yatra
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.