Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయాలని కేంద్రం అనుకోవడం లేదని, ప్లాంటును బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామంటూ
కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ గురువారం చేసిన ప్రకటన మీడియా కథనం అని కొట్టి పారేసింది. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంటు పనిచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత కార్మికులు, తదితరులతో జరిగిన భేటీల్లో ఆయన ఈ విషయంపై విస్పష్టమైన ప్రకటన చేయలేదు.
దీంతో రకరకాల చర్చలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ప్రైవేటీకరణపై కేంద్రం తాజాగా స్పష్టతనిచ్చింది. రాజకీయ ఎత్తుగడలకు తలవంచి కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాయిదా వేసి దిద్దుబాటు చర్యలు చేపట్టటం వెనుక వివిధ రాజకీయ పార్టీలు వారికి అనుగుణంగా భాష్యం చెప్పుకుని భుజాలు ఎగరేసిన సంబరం ఆవిరైయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల అందోళన వారి సమస్యలు ఎప్పటికి తీరుతాయో?