Adipurush Movie Review : నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్, తృప్తి తోరదమల్ తదితరులు.
దర్శకుడు : ఓం రౌత్
నిర్మాత : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
మ్యూజిక్ : సంచిత బల్హారా, అంకిత్ బల్హారా
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ : 16/6/2023
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. అలాంటి ప్రభాస్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఆదిపురుష్. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించిన మెప్పించారా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఎలాంటి అంచనాలను అందుకుందో, ప్రేక్షకుల హృదయాలను గెలిచిందో లేదో తెలుసుకుందాం..
స్టోరీ :
దశరథ మహారాజు తన వృద్ధాప్యంలో రాజ్యం నుండి విముక్తి పొంది, తన పెద్ద కొడుకు రాముడిని (ప్రభాస్) అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని కోరుకుంటాడు. కానీ దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి రాఘవకు బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని పట్టుబట్టింది. అంతే కాదు భరతుని పట్టాభిషేకంతో పాటు రాముడిని 14 సంవత్సరాలు వనవాసం చేయమని కోరుతుంది. తండ్రి ఆజ్ఞ ప్రకారం, రాముడు అతని భార్య సీత (కృతి సనన్) మరియు లక్ష్మణుడి తో సహా వనవాసానికి బయలుదేరుతాడు. వనవాసంలో ఉన్న రోజుల్లో రావణుడి చెల్లి శూర్పణఖ లక్ష్మణుడిని ఇష్టపడుతుంది.
కానీ లక్ష్మణుడికి అది నచ్చకపోవడంతో శూర్పణఖ తన రాక్షస సైన్యంతో దాడి చేసింది, ఈ దాడిలో సీత గాయపడుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కొస్తాడు. అతను వెళ్లి తన అన్నయ్య రావణుడి (సైఫ్ అలీఖాన్)కి ఈ విషయం చెప్పడంతో, రావణుడు ఆగ్రహానికి గురవుతాడు మరియు సన్యాసి రూపంలో వచ్చి సీతని అపహరించి లంకకు తీసుకెళ్లి అశోక వనం లో బంధిస్తాడు. అపుడు రాముడు రావణాసురుడిని ఎలా ఓడించి సీతను తీసుకొచ్చాడు..?, అందుకు వానరసైన్యం ఎలాంటి సహాయం చేశాడో వెండితెరపై చూడాలి.
రివ్యూ :
సినిమా ప్రారంభం విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ పాడేటప్పుడు యానిమేటడ్ శ్రీ మహా విష్ణువు విజువల్స్ అద్భుతంగా అనిపించింది. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. విజువల్స్ మొత్తం గ్రాండియర్ గా అద్భుతంగా అనిపించాయి. ఇక తర్వాత వచ్చిన ‘రామ్ సీత రామ్’ పాట, రావణాసురుడు సీతని అపహటించే సన్నివేశం చాలా చక్కగా తీసాడు. ఈ సన్నివేశాలన్నిటికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా కుదిరింది. కానీ మిగిలిన సన్నివేశాలకు VFX చాలా నాసిరకంగా అనిపించింది.
ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి డ్రామాతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము కానీ, VFX మాత్రం పైన చెప్పిన సన్నివేశాలకు తప్ప , మిగిలింది మొత్తం చాలా దారుణంగా అనిపించింది. రామాయణం గురించి పసి పిల్లల దగ్గర నుండి పండుముసలి వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికి తెలుసు, మళ్ళీ అదే కథతో తీస్తున్నారు అంటే కచ్చితంగా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండాలి, అప్పుడే ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారు, ఈ సినిమాలో మిస్ అయ్యింది అదే. కానీ డ్రామా పండింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉంది.
ఇక సెకండ్ హాఫ్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది కానీ, ఇక్కడ కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ కి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది. ముఖ్యంగా రావణాసురిడి పది తలలు చూపించిన విధానానికి మాటలు లేవు మాట్లాడుకోడాలు లేవు. అంత దరిద్రంగా ఇప్పటి వరకు రావణాసురుడిని ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. ఓం రౌత్ ఏ ఉద్దేశ్యం తో రావణుడిని అలా చూపించాడో ఎవరికీ అర్థం కాలేదు. అంతే కాదు ఈ చిత్రం లో రాముడిని రాఘవ్ అని, సీత ని జానకి అని, రావణాసురుడి ని లంకేశ్ అనే పేర్లతో ఎందుకు పిలిపించాడో కూడా అర్థం కాదు.
నటీనటులు ఎలా చేశారంటే.. ఇక ప్రభాస్ లుక్స్ బాగాలేకపోయిన, నటన పరంగా మంచి మార్కులే కొట్టేసాడు. కానీ ఆయన లుక్స్ మాత్రం క్లోజప్ షాట్స్ లో చాలా వరస్ట్ గా ఉన్నాయి, డబ్బింగ్ కూడా సరిగా చెప్పలేదు అని అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత, ఇక సీత పాత్రలో కృతి సనన్ జీవించింది, రావణుడి పాత్ర లో సైఫ్ అలీ ఖాన్ పర్వాలేదు అనిపించాడు, ఇక ఈ చిత్రానికి ఆయువు పట్టులాగా నిల్చింది ఏదైనా ఉందా అంటే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
* ప్రభాస్
* ఓం రౌత్ దర్శకత్వం
* విజువల్స్
* హనుమంతుడి పాత్ర
మైనస్ పాయింట్స్ :
* సాగదీత
* సెకండ్ ఆఫ్
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ : VFX పై పెద్దగా అంచనాలు లేకపోయినా సినిమా పరంగా అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ఏం మాయ చేస్తాడో చూడాలి..
Discussion about this post