Amigos Review: బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు మేకర్స్. ప్రతి సినిమాకు విభిన్నమైన కథను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కళ్యాణ్ రామ్ ఈసారి అమిగోస్ సినిమాతో మన ముందుకు వచ్చారు.
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్
సంగీతం : జిబ్రాన్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
రచన, దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023
కథ:
ఈ చిత్రంలో కళ్యాణ్ త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ గా మైఖేల్, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మంజునాథ్ మరియు బిజినెస్ మ్యాన్ గా సిద్దార్థ్. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ ముగ్గురు కలుసుకుంటారు. ఒక పక్క NIA మైఖేల్ ని పట్టుకునేందుకు వెతుకుతూ ఉంటుంది.. ఎందుకంటే అతను ఒక పెద్ద నేరస్తుడు, ఎన్నో హత్యలు చేసి ఉంటాడు.
NIA నుండి తప్పించుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్న మైఖేల్ కి తన రూపంలో అచ్చుగుద్దినట్టు ఉన్న మంజునాథ్, సిద్దార్థ్ కలవడంతో వాళ్ళని వాడుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో మైఖేల్ సక్సెస్ సాధిస్తాడా? మైఖేల్ కి సిద్దార్థ్ మరియు మంజునాథ్ తో రక్తసంబంధం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మూవీ చూడాల్సిందే.
Gallery: Heroine Sree Leela Romantic Photos
విశ్లేషణ:
అమిగోస్ డోపెల్గాంగేర్ అనే ఆసక్తికరమైన కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్తూ ఉంటుంది. మూడు పాత్రల పరిచయంతో బాగానే ప్రారంభమైయినప్పటికీ, మొదటి 20 నిమిషాలు మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది. కానీ తరువాత మనకు విసుగు తెప్పిస్తుంది.
ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లాగా సాగిపోతుంది కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ వల్ల చివరి సగం చూడాలనే ఆసక్తిని కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గానే సాగిపోతుంది. సెకండాఫ్లో యాక్షన్ బ్లాక్స్, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది.
ప్లస్ పాయింట్లు:
కళ్యాణ్ రామ్ యాక్టింగ్,
కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్లు:
రోటీన్ నేరేషన్,
స్క్రీన్ ప్లే
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: మొత్తం మీద, అమిగోస్ ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా.
Discussion about this post