Anni Manchi Sakunamule Review : చిత్రం : అన్నీ మంచి శకునములే
నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి.
నిర్మాత : ప్రియాంక దత్
దర్శకత్వం : నందిని రెడ్డి
మ్యూజిక్ : మిక్కీ జే మేయర్
విడుదల తేదీ : మే 18, 2023
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. చాలాకాలంగా మంచిహిట్ కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ కి యంగ్ బ్యూటీ మాళవిక నాయర్ ఈ చిత్రంలో జంటగా నటించింది. ఈ సమ్మర్ కి ఆహ్లాదభరితమైన చిత్రంగా వస్తోంది అంటూ బజ్ క్రీయేట్ చేశారు. మరీ ఈ చిత్రం సమ్మర్ కి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరిస్తుందా లేదా అనేది చూద్దాం…
స్టోరీ :
రిషి (సంతోష్ శోభన్), ఆర్య (మాళవిక నాయర్) పుట్టిన వెంటనే డాక్టర్లు వారిద్దరిని మార్చేస్తారు. అందుకు కారణం వారి ఇద్దరి కుటుంబాల మధ్య పూర్వీకుల నుండి వస్తున్న ఆస్తులు వల్ల ఏర్పడిన గొడవలే. తర్వాత వాళ్ళిద్దరూ పెరిగి పెద్ద అవుతుండగా వారితో పాటు వారి కుటుంబాల మధ్య గొడవలు కూడా పెరుగుతాయి. కానీ వీరు మాత్రం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. అసలు వారి కుటుంబానికి మధ్య ఉన్న గొడవ ఏంటి? దాన్ని వీళ్ళిద్దరూ ఎలా పరిష్కరించారు? వీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీరి ప్రేమ వల్ల వారి ఇళ్లల్లో ఎలాంటి పరిణామాలు సంభవించాయి.. లాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
రివ్యూ :
టాలీవుడ్ లో ఇప్పటికే కొన్ని వేల కుటుంబ కథాచిత్రాలు వచ్చాయి, ఇంకా కొత్తగా ఏం తీస్తాం అనే పరిస్థికి వచ్చేసిన తరుణంలో మళ్లీ స్వప్న సినిమాస్ నుంచి “అన్ని మంచి శకునములే” రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.. అయితే కథపరంగా కొత్తదనం లేకపోయినా అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కథాంశాన్ని ఎంచుకుని మంచి నటి నటులతో ఆ పాత్రల్ని పోషింపచేసి ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయగలిగారు. కథలో కామెడీ ఉన్నప్పటికీ ఎమోషన్ ఈ కథకి వెన్నెముక లాంటిది, అయితే ఆ ఎమోషన్ ని పక్కన పెట్టి కొంచెంసేపు హీరో, హీరోయిన్ ట్రాక్ మీద ఫోకస్ చేయడం కొంచెం గాడి తప్పినట్టు అనిపిస్తుంది.
సంతోష్ శోభన్ రిషి పాత్రలో అవలీలగా నటించేసాడు, ఇక ఆర్య గా మాళవిక నాయర్ బాగా చేసింది, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, వెన్నెల కిషోర్ అందరూ తమ తమ పాత్రల మేరకు మెప్పించారు. ఫ్యామిలీ డ్రామా దానికి ఒక ఎమోషన్ ని జోడించి తియ్యడంలో నందిని రెడ్డి ఎక్స్పర్ట్, అయితే కథ కొత్తది కాకపోయినా, పాత్రలు వారి మధ్య సంభాషణలు, ఎమోషన్స్ బాగా వర్క్అవుట్ అయ్యాయి. ఏది ఏమైనా కొన్ని తప్పులు ఉన్నప్పటికీ సగటు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. టెక్నికల్ గా అన్ని మంచి శకునములు బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
* నిర్మాణ విలువలు
* సహాయ పాత్రల్లో నటించిన వారి నటన
* కొన్ని కామెడీ సీన్స్
* సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
* సాగదీసినట్టుగా అనిపించే కొన్ని సీన్స్
* సాంగ్స్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : అన్నీ మంచి శకునములే డీసెంట్ ఫ్యామిలీ డ్రామా. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దాం అనుకునే వారికి.. ఒకసారి చూడగలిగే మూవీ.