Rudrudu Movie Review : నటీనటులు : రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు
దర్శకుడు : కతిరేసన్
నిర్మాతలు : కతిరేసన్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : ఆర్‌డి
విడుదల తేదీ : 14/4/2023
యాక్టర్, కొరియోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా, కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ రుద్రుడు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే..
కథ :
ఒక మాములు ఉద్యోగం చేసుకునే వ్యక్తి రుద్రుడు (లారెన్స్) తనకు నచ్చిన అమ్మాయి అనన్య (ప్రియా భవాని శంకర్ ) పెళ్ళిచేసుకుని కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అయితే అంత బాగానే ఉంది అనుకునే టైంలో తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని దుండగుల చంపేస్తారు. దీంతో ఒక్కసారిగా రుద్రుడి జీవితం తలకిందులవుతుంది. ఎలాగైనా తన భార్యని చంపింది ఎవరో తెలుసుకొని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. చివరికి, అనన్యని ఎందుకు చంపారు? దీని వెనక ఎవరున్నారు అనేది మిగిలిన కథ.
రివ్యూ :
సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు, మనం ఎప్పట్నుంచో చూస్తున్న ఫార్మాట్లో సాగుతుంది. హీరో పరిచయం, హీరోయిన్ ని చూసి ప్రేమలో లోపడటం, పెళ్లి చేసుకోవడం, అంత బాగుంది అనుకునే టైం కి విలన్ తనని చంపేయడం, చివరకు హీరో వాళ్లపైనా రేవంజ్ తీర్చుకోవడం. అయితే సినిమా ఎంత ఓల్డ్ గా ఉన్న, హీరో ఎలివేషన్లు, లవ్ ట్రాక్ పతాక సన్నివేశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాయి.
ప్లస్ పాయింట్లు:
* BGM
* పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్లు:
* రొటీన్ కథనం
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్ : మొత్తం మీద రుద్రుడు.. అవుట్ డేటెడ్ కమర్షిల్ చిత్రం.