Shaakuntalam Movie Review : నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి, అల్లు అర్హ తదితరులు
నిర్మాణ సంస్థ: గుణ టీమ్‌వర్క్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు : నీలిమా గుణ
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
విడుదల తేదీ : 14/4/2023
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘శాకుంతలం’. ఇందులో దేవ్ మోహన్ హీరో కాగా సమంత హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా శాకుంతలంను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ‘యశోద’ తర్వాత సమంత మరో విజయం అందుకుందా? గుణశేఖర్ సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వీక్ అనే విమర్శను అధిగమించారా? లేదా చూద్దాం..
కథ :
విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి మేనక (మధుబాల)ను ఇంద్రుడు భూలోకానికి పంపిస్తాడు. తపస్సు భంగం కావడమే కాదు.. వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటి అవుతారు. ఫలితంగా మేనక ఓ అమ్మాయికి జన్మ ఇస్తుంది. ఆ చిన్నారిని భూలోకంలో వదిలి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అడవిలో చిన్నారిని చూసిన కణ్వ మహర్షి శకుంతల అని పేరు పెట్టి కన్న బిడ్డలా పెంచుతాడు. కట్ చేస్తే… శకుంతల పెద్దది అవుతుంది.
ఓ రోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్).. శకుంతల (సమంత)ను చూస్తాడు. ఒకరిపై మరొకరు మనసు పడతారు. గంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత సకల రాచ మర్యాదలతో ఆహ్వానించి, మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని చెబుతాడు. శకుంతల గర్భవతి అవుతుంది.
ఎంతకూ దుష్యంతుడు రాకపోవడంతో అతడి దగ్గరకు వెళుతుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి తాను వెళ్ళిన విషయం గుర్తుంది కానీ శంకుతల ఎవరో తనకు తెలియదని దుష్యంత మహారాజు చెబుతాడు. అతడు ఎందుకు అలా చెప్పాడు? నిండు సభలో శకుంతలకు జరిగిన అవమానం ఏమిటి? ఆ తర్వాత ఏమైంది? మధ్యలో దుర్వాస మహాముని (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? దుష్యంతుడు, శకుంతల చివరకు ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా.
రివ్యూ :
కాళిదాసు రచించిన నాటకం అభిజ్ఞాన శాకుంతలం. భారతీయ సాహిత్యంలో మంచి ప్రేమకథగా ప్రసిద్ధికెక్కింది. అలాంటి కథను రామారావు టైంలోనే అప్పట్లో అప్పటి భాషకు అనుగుణంగా తీశారు. ఆ తర్వాత తమిళంలోనూ వచ్చింది. ఇప్పుడు గుణశేఖర్ తీశారు. 3డి ఫార్మెట్లో తీయడం మంచిదే. సాహసం కూడా. ప్రేమకావ్యాన్ని, తెలిసిన కథను చెప్పడమూ సాహసమే. ఈ కథను పుస్తకాల్లో చదువుతే కాస్త రిలీఫ్ గా వుంటుంది.
కానీ వెండితెరపై అంత కిక్ ఇవ్వదు. పాతకాలం కథ కాబట్టి నింపాదిగా కథనం నడుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది గ్రాఫిక్స్, విజువల్స్ లో కొండలు లోయలు, హిమాలయాలు, కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన క్లయిమాక్స్ కథకు తగిన విధంగా చూపించారు. నటనపరంగా సమంత, దుష్యంతులు సరిపోయారు. దుష్యంతునిగా తెలుగులో ఎవరూ చేయకపోవడంతో దేవ్ ను తీసుకోవాల్సివ వచ్చింది. భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తె ఆర్హ నటించి మెప్పించింది.
ప్లస్ పాయింట్స్:
* సమంత యాక్టింగ్
* గుణశేఖర్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
* గ్రాఫిక్స్ తేలిపోవడం
* సాంగ్స్
* లాజిక్స్ మిస్
* బోర్ కొట్టించే చాలా సీన్స్
రేటింగ్ : 2/5
ట్యాగ్ లైన్ : సీరియల్ కి ఎక్కువ.. సినిమాకు తక్కువ! విజువల్ ట్రీట్‌గా ‘శాకుంతలం’..