Sir Movie Review: నటీనటులు: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయి కుమార్, సుమంత్, తనికెళ్ళ భరణి తదితరులు.
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం : వెంకీ అట్లూరి
బ్యానర్స్ : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్య్చూన్ ఎంటర్టైన్మెంట్స్.
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేది : 17/2/2023
తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో ధనుష్. ఫస్ట్ టైం ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో చేసిన సినిమా ‘సార్’. తమిళంలో ‘వాత్తి’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాతో ధనుశ్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ:
కడప జిల్లా కలెక్టర్ మూర్తి (సుమంత్) తనను కలవటానికి వచ్చిన స్టూడెంట్స్‌తో తన గురువు బాలగంగాధర తిలక్ అలియాస్ బాలు (ధనుష్) గురించి చెప్పటంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. 1993 దశకంలో ప్రైవేటు కాలేజీల హవా ప్రారంభమయ్యాయి. పిల్లల తల్లిదండ్రులు నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు కాలేజీల వైపే చూడటం ప్రారంభించారు. అందుకు కారణం ప్రభుత్వ కాలేజీల్లో సరైన టీచర్లు ఉండరు. త్రిపాఠి జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పని చేసే బాలు, కొన్ని కారణాలతో సిరిపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి లెక్కల టీచర్‌గా వెళతాడు.
ఆయనతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్స్ కూడా వస్తారు. అప్పటికే ఆ కాలేజీలో బయాలజీ టీచర్ మీనాక్షి (సంయుక్తా మీనన్) పని చేస్తుంటుంది. కాలేజీకి వెళ్లిన బాలుకి అక్కడ స్టూడెంట్స్ తల్లిదండ్రులు వారి పిల్లలు చదువు కోసం కాలేజీకి వెళ్లటం కంటే పనికి వెళ్లేనే మంచిదని అనుకుంటుంటారు. అప్పుడు బాలు వారిలో ఎలా మార్పు తీసుకొచ్చాడు? బాలు చేసిన పని వల్ల త్రిపాఠి (సముద్ర ఖని)కి వచ్చిన నష్టమేంటి? ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని బాలు ఎలా దాటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే..
బాలు పాత్రలో ధనుష్ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం బాలు పాత్ర చుట్టే తిరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్ వన్ మ్యాన్ షో నడిపాడని అనొచ్చు. ఫైట్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. మీనాక్షిగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్‌గా సముద్ర ఖని తనదైన నటనతో మెప్పించాడు. సిరిపురం ప్రెసిడెంట్‌గా సాయి కుమార్ ఉన్నంతలో చక్కగా నటించాడు.
ప్లస్ పాయింట్స్:
ధనుష్ యాక్టింగ్,
ప్రొడక్షన్ వాల్యూస్.
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్,
కమర్షియల్ అంశాలు లేకపోవడం.
రేటింగ్ : 2.75/5
చివరి మాట: ‘సార్’ మూవీ ఆలోచింప చేసే ఎడ్యుకేషనల్ డ్రామా.. సందేశం ఉన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
Discussion about this post