Takkar Movie Review : డైరెక్టర్ : కార్తీక్ జి క్రిష్
నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, తదితరులు
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్ : నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫీ : వాంచినాథన్ మురుగేషన్
హీరో సిద్ధార్థ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన హీరో. ఇక లవర్ బాయ్ అనే పేరుకు కేరాఫ్ అడ్రస్ సిద్ధార్థ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలాకాలం తరువాత మహా సముద్రం అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ అది అంతగా ఆడలేదు. తాజాగా టక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
స్టోరీ :
హీరో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎలాగైనా డబ్బు సంపాదించాలి.. రిచ్ అవ్వాలి అనుకునే మెంటాలిటీ. డబ్బే అన్నిటికి పరమావధి అనుకునే మనస్తత్వం. కానీ హీరోయిన్ ఇందుకు పూర్తిగా రివర్స్. జీవితంలో డబ్బు శాశ్వతం కాదు.. మనిషికి మనిషే తోడు అనుకునే క్యారెక్టర్. ఈ సినిమాలో అమ్మాయిల అక్రమ రవాణా మెయిన్ ప్లాట్. అనుకోకుండా ఈ ఉచ్చులో చిక్కుకుంటాడు హీరో. ఇది హీరోయిన్‌తో దూరాన్ని పెంచుతుంది. తాను చేస్తున్నది తప్పని తెలుసుకుని హీరో ఎలా మారాడు. హీరోయిన్ను ఎలా దక్కించుకున్నాడు. విలన్లకు ఎలా బుద్ధి చెప్పాడు అనేది తెలుసుకునేందుకు మూవీ చూడాల్సిందే..
రివ్యూ :
టక్కర్ చిత్రం ఏ విధంగానూ కొత్తగా అనిపించదు, ఇక ఈ చిత్రం విజువల్స్ చూస్తుంటే ఏదో మూడు సంవత్సర క్రితం తిసారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి టక్కర్ కమర్షియల్ చిత్రమే అయినా రెగ్యులర్ కమర్సియల్ చిత్రం లాగా మాత్రం అనిపించదు. ఫస్టాఫ్.. హీరో ఏది ఏమైనా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నాడని బాగా ఎస్టాబ్లిష్ చేసారు. ఇక హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కథకి ఉపయోగపడేలానే తీర్చిదిద్దారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తాయి.
చాలా లయెర్స్ తో ముడిపడి ఉన్న ఈ కథ, ఇంటర్వెల్ దగ్గర మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రెండవ భాగం చూసేలా చేస్తుంది. సెకండాఫ్.. హీరోకి డబ్బు మాత్రమే ప్రధానమని తెలిసి, దాన్ని హీరోయిన్ కి సంబందించిన బిజినెస్ కి ముడి పెట్టడంతో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇక ఎప్పుడైతే తన ప్రేయసిని కిడ్నాప్ చేసి తీసుకు వస్తే చాలా డబ్బు ఇస్తాం చెప్తారో అప్పటి నుంచి ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తుంది.
నటీనటులు ఎలా చేశారంటే..
సిద్ధార్థ్ కి ఇలాంటి పాత్రలన్నీ కొత్తేమి కాదు, ఎక్కువ లవ్ స్టోరీస్ లో చూసే సరికి, తన లుక్ అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇక పెద్దగా సవాలు విసిరే పాత్ర కాకపోయినా, తన పాత్రకి న్యాయం చేసాడు. ఇక దివ్యంశ గత చిత్రాల్లో మాదిరే రొమాన్స్ కే పరిమితం కాకుండా వాటితోపాటు కథలో భాగమైంది, కానీ నటించడంలో మాత్రం విఫలమైంది. ఇక కథ సీరియస్ గా వెళ్తున్న టైంలో యోగిబాబు తన మార్కు కామెడీతో బాగా నవ్విస్తాడు. ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగా చేసారు.
డైరెక్టర్ కార్తీక్ జి క్రిష్ ఎంచుకున్న కథ అంత కొత్తగా లేదు, కానీ సగటు ప్రేక్షకుణ్ణి మెప్పించే అంశాలని జోడించి కొంతమేరకు విజయం సాధించాడనే చెప్పొచ్చు. సాంకేతికంగా టక్కర్ బానే అనిపిస్తుంది. నివాస్ కె ప్రసన్న నిరా అనే పాట రిలీజ్ కి ముందే మంచి హిట్ అయింది. ఇక మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోవు. BGM పర్వాలేదు కానీ ఇంకా బాగుండాల్సింది. వాంచినాథన్ మురుగేషన్ సినిమాటోగ్రఫీ కథకి తగ్గట్టు బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
* కథనం
* BGM
* కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
* ఊహించదగిన కథనం
* మ్యూజిక్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఓకే అనిపిస్తుంది. హీరో సిద్ధార్థ్ కూడా వరకు నిరాశపరిచాడు.
Discussion about this post