Veera Simha Reddy Movie Review in Telugu :
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్, అజయ్ ఘోష్ తదితరులు.
దర్శకుడు: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతి పోటీలో ఏ రేంజ్ లో నిలబడనుంది ?, ఇంతకీ ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథ :
వీర సింహారెడ్డి (సీనియర్ బాలయ్య) పులిచర్ల ప్రాంతానికి పెద్దాయన. నాయకుడిలా రాయలసీమకి అండగా నిలబడుతూ.. సీమకి మంచి చేస్తుంటాడు. అలాంటి వీర సింహారెడ్డిను చంపడానికి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) ముప్పై ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతని భార్య వీర సింహారెడ్డికి సవతి చెల్లి అయిన భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) కూడా వీర సింహారెడ్డి చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు ఇస్తాంబుల్లో జయసింహా రెడ్డి (జూనియర్ బాలయ్య) తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈషా (శ్రుతి హాసన్)తో జయసింహాకి పరిచయం అవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, అప్పటి వరకూ తన తండ్రి వీరసింహా గురించి తెలియని జయసింహకి, వీరసింహా రెడ్డి గురించి తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరసింహా రెడ్డి చనిపోతాడు. అనంతరం జయసింహ తన తండ్రి కోసం ఏం చేశాడు?, చివరకు రాయలసీమ కోసం ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ.
Also Read : మౌనాన్ని బద్దలు గొట్టనున్న యువత, శ్రీకాకుళం రణస్థలం లో ఈరోజే జనసేన “యువశక్తి”
విశ్లేషణ:
వీర సింహారెడ్డి అంటూ ప్యూర్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య మాస్ యాక్టింగ్ అండ్ కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే మెయిన్ పాయింట్ లోని మెయిన్ కంటెంట్ తో పాటు ఇంటర్వెల్ బాగుంది. కానీ, మిగిలిన బాగోతం అంతా రెగ్యులర్ రొట్ట కొట్టుడు మేకింగ్ స్టైల్ తో రొటీన్ బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాలతో నిరాశ పరిచింది. ఓవరాల్ గా వీర సింహారెడ్డి అంచాలను అందుకోలేకపోయింది. కాకపోతే, బాలయ్య ఫ్యాన్స్ కి కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ నచ్చుతాయి.
ప్లస్ పాయింట్స్:
* బాలయ్య బాబు యాక్షన్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీ,
* ఫస్ట్ హాఫ్ డ్యాన్స్ చేసే సీన్ లో శ్రుతి హాసన్ గ్లామర్.
* భారీ యాక్షన్ విజువల్స్,
* కొన్ని చోట్ల ఎమోషన్స్.
Also Read : Balli Sastram in Telugu
మైనస్ పాయింట్స్:
* లాజిక్ లెస్ అండ్ రొటీన్ యాక్షన్ డ్రామా,
* రెగ్యులర్ సీన్స్ తో సాగే స్లో నేరేషన్,
* స్లోగా సాగే బోరింగ్ స్క్రీన్ ప్లే,
* సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,
* గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.
* అన్నిటికీ మించి ఎలాంటి కొత్తదనం లేకపోవడం.
రేటింగ్: 2.5
చివరగా.. బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా.
Discussion about this post