Vinaro Bhagyam Vishnu Katha Movie Review: నటీనటులు : కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ, మురళీ శర్మ, ‘కె.జి.యఫ్’ లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు
ఛాయాగ్రహణం : డేనియల్ విశ్వాస్
సంగీతం : చైతన్ భరద్వాజ్
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : ‘బన్నీ’ వాస్
దర్శకత్వం : మురళీ కిషోర్ అబ్బూరు
విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2023
కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ‘రాజాగారు రాణివారు’తో హీరోగా పరిచయమైన కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కటి ఆదరణ పొందింది. ఈ మధ్యే ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు.
కథ :
దర్శనా (కశ్మీరా పర్ధేశీ) యూట్యూబర్. ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ మాత్రం రావు. ఫేమస్ కావడం కోసం నెంబర్ నైబర్స్ (ఫోన్ నంబర్‌కు ఒక అంకె ముందు, వెనుక)కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో ప్లాన్ చేస్తుంది. దర్శనా ఫోన్ నెంబర్ నైబర్స్ ఎవరంటే.. ఒకరు, శర్మ (మురళీ శర్మ). ఆయనకు పెట్స్ క్లినిక్ ఉంటుంది. ఇంకొకరు, విష్ణు (కిరణ్ అబ్బవరం). ఇతరులకు సహాయం చేయడం అతని గుణం. ముగ్గురు కలిసి వీడియోలు చేస్తారు. ఈ క్రమంలో దర్శనతో విష్ణు ప్రేమలో పడతాడు. కూడా దర్శనను ప్రేమిస్తాడు.
అతనితోనూ సన్నిహితంగా ఉంటూ వస్తుంది. అయితే, ఒక రోజు శర్మను షూట్ చేస్తుంది. అతను మరణిస్తాడు. శర్మను దర్శనా చంపడానికి కారణం ఏంటి? విష్ణు కోసం ఎన్ఐఏ & రాయలసీమకు చెందిన ఓ మంత్రి (‘కె.జి.యఫ్’ లక్కీ) ఎందుకు తిరుగుతున్నారు? శర్మ హత్య కేసులో జైలుకు వెళ్ళిన దర్శనను బయటకు తీసుకు రావడం కోసం విష్ణు ఏం చేశాడు? ముంబై గ్యాంగ్ స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ)కు, విష్ణుకు సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ..
విశ్లేషణ:
మన మొబైల్ నంబర్ నుంచి పక్క నంబర్‌కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది? వారెవరు.. ఎక్కడ ఉంటారో.. ఏం చేస్తారో తెలియదు. కానీ ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తే.. వినడానికే కొత్తగా, గమ్మత్తుగా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. దర్శకుడు మురళీ కిశోర్ చాలా కొత్త పాయింట్‌ని ఎంచుకొని అంతే కొత్తగా తెరపై చూపించాడు. కొన్ని సీన్లు సినిమాటిక్‌గా ఉన్నా.. ఫ్లోలో ఓకే అనిపిస్తాయి.
ఎన్ఐఏ అధికారులు ఓ టెర్రరిస్టు గ్రూప్‌ని పట్టుకోవడం కోసం ప్రయత్నించడం.. వారు పారిపోయి ఒకచోట దాక్కోవడం..వారి దగ్గరకు హీరో వెళ్లడం.. ఇలా సినిమా ప్రారంభమే సీరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికీ సినిమా అంతా లవ్‌స్టోరీగా మారిపోతుంది. నైబర్ నెంబర్ కాన్సెప్ట్‌తో హీరో హీరోయిన్లు కలిసిన తర్వాత వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీ శర్మ హీరోయిన్‌తో కలిసి వేసే స్టెప్పులు.. వారిద్దరి రిలేషన్‌పై హీరో వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి.
ప్లస్ పాయింట్స్:
కిరణ్ యాక్టింగ్,
కథ నేపథ్యం,
BGM
మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్,
కొన్ని ఇల్లాజికల్ సీన్స్
రేటింగ్: 2.5
ట్యాగ్ లైన్: లాజిక్స్ తో సంబంధం లేకుండా సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారిని శాటిస్ఫై చేస్తుంది.
Discussion about this post