Waltair Veerayya Movie Review :
నటీనటులు : చిరంజీవి, శ్రుతీ హాసన్, రవితేజ, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ప్రదీప్ రావత్ తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో ఊర్వశి రౌతేలా
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి
ఛాయాగ్రహణం : ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, మాటలు, దర్శకత్వం : బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)
విడుదల తేదీ: జనవరి 13, 2022
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ:
వాల్తేరు వీరయ్య కథ విషయానికి వస్తే.. జాలారి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి) మాటంటే అక్కడి వారికి వేదవాక్కు. కానీ, అతనికే తెలియకుండా కొందరు సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేస్తూంటారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) జాలరి పేటకు వెళ్ళి డ్రగ్స్ దందా చేసేవారిని అరెస్ట్ చేస్తాడు. అడ్డు వచ్చిన వీరయ్యనూ పట్టుకుపోతాడు విక్రమ్.
Also Read : Veera Simha Reddy Movie Review In Telugu
నిజానికి వీరయ్య, విక్రమ్ ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరు. ఒకరికొరంటే అభిమానం ఉన్నా, తమ పరిస్థితుల కారణంగా దానిని బహిర్గతం చేయరు. ఈ డ్రగ్స్ దందాకు సాలమోన్ సీజర్ (బాబీ సింహా) ముఖ్య సూత్రధారి. వీరయ్య కటకటాల వెనుక ఉన్న సమయంలో విక్రమ్ దుండగుల చేతుల్లో మరణిస్తాడు. తమ్ముడు చనిపోవడానికి అసలు కారకుడైన ప్రకాశ్ రాజ్ మలేసియా ఉన్నాడని తెలుసుకొని వీరయ్య అక్కడకు వెళ్తాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నదే కథ.
విశ్లేషణ:
ప్రథమార్ధం చిరంజీవి ఎంటర్ టైన్ మెంట్ తో భళా అనిపించింది. ఆ తరువాత బ్రదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారు. రవితేజ పాత్ర నిడివి తక్కువే అయినా తన ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా ఉంది. ఇక శ్రుతి హాసన్ సీబీఐ ఆఫీసర్ గా వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన తారాగణమంతా తమ పాత్రలకు తగ్గట్టుగానే సాగారు.
“బాస్ పార్టీ…” , “పూనకాలు లోడింగ్…” పాటలు నిజంగానే కిర్రెక్కించాయి. “నువ్వే శ్రీదేవైతే…నేనే చిరంజీవంటా…”, “నీకేమో అందమెక్కువ…” పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏ.యస్. ప్రకాశ్ రూపొందించిన సెట్స్ కనువిందు చేశాయి.
ప్లస్ పాయింట్స్:
– చిరంజీవి పంచిన వినోదం
– రవితేజ పాత్ర
– ఆకట్టుకొనే పాటలు
– మేకింగ్ వ్యాల్యూస్
మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉండడం
రేటింగ్: 3/5
ట్యాగ్ లైన్: రెగ్యులర్ రొటీన్ కథ అయినప్పటికీ.. ఇంటర్వెల్ బ్యాంగ్ మెగాభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. చిరంజీవి, రవితేజ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ మెగాస్టార్‌ను చూడొచ్చు.
Discussion about this post