ఎక్కడో ఒక చోట!
పోరాడి అలిసి నిద్రిస్తున్న సమాధులు ఆశయాల చెట్లను కంటాయ్.
ఆశలు చిగిరిస్తాయ్
ఎక్కడో ఒక చోట!
భావోద్వేగాల బ్రతుకులు , ధనికావేశ అగ్నికిలల్లో ఇనుప చువ్వలు ధరించిన మాంసపు ముద్దలవుతాయ్…
ఎక్కడో ఒక చోట!
చంటిపాప నోట్లో వొదగాల్సిన కుచంబులు మగమృగాల చేతిలో నలుగుతూ ఉంటాయ్…
ఎక్కడో ఒక చోట !!
ఆకలిపోరాటంలో అలిసిన డొక్కలు, దిక్కులు పెక్కటిల్లేలా ఘోషిస్తూ ఉంటాయ్…
ఎక్కడో ఒక చోట!!
తమ ఆశల్ని మోసిన వళ్ళు, ఫలితం కాసిన కళ్ళు దీనంగా నా ” సిక్” అవుతూ ఉంటాయ్…
నేను నిమిత్త మాత్రున్ని, నిజం నా కళ్ళకు ఎరుకే!!!!!!
– మాధవ విష్ణు
Discussion about this post