అంతరాంతరాలలో ప్రతీ మగవాడికీ తెలుసు.. తనలో లేనిదేదో స్త్రీలో ఉందని. ముందుగా స్త్రీ అంటే అతనికి ఆకర్షణ..
ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. అతడు స్త్రీ ప్రేమలో పడిపోతాడు. స్త్రీ ఒక విధంగా అతనికి మత్తు మందైపోయింది.
సమస్య అక్కడే మొదలయ్యింది.
తాను స్త్రీ పై ఆధారపడ్డానన్న భావన ప్రతీ మగవాడికీ ఉంటుంది. అందుకే అతడు స్త్రీని భానిసగా చేయాలని చూస్తాడు. ఆత్మికంగా భానిసని చేయాలని ప్రయత్నిస్తాడు.
ఆమె అందంగా ఉంటుందని అతడికి భయం. ఆమె అతడికి మాత్రమే అందంగా కనిపించదు.
ఆమెను ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా అలాగే కనిపిస్తుంది.
అప్పుడే పురుషాహంకారిలో గొప్ప అసూయ తలెత్తుతుంది…
– ఓషో