A strange Village : అతి వర్షాల కారణంగా చెల్లా,చెదురైపోయిన ప్రాంతాలను మనం చూసే ఉంటాం. వర్షాధారణ తక్కువగా ఉన్న దేశాలను కూడా మనం చూసే ఉంటాం. కానీ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క చుక్క వర్షం కూడా పడని ఒక ప్రాంతం ఉందని మనకు తెలియదు. ఒక్క వర్షం చుక్క కూడా పడని ఆ ప్రాంతం ఎక్కడ ఉంది. అసలు ఆ ప్రాంతంలో వర్షం ఎందుకు కురవదు. అనే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంకొక విచిత్రం ఏమిటంటే అక్కడి ప్రజలు భూమిపైన వర్షం కురిసే దృశ్యాన్ని పైనుంచి వీక్షిస్తారు అంట. అంటే దీనిని బట్టి మనకు ఒక అనుమానం వస్తుంది. ఈ గ్రామం ఏమైనా అంతరిక్షంలో ఉందా ఏమి అని మనం అనుమానించవచ్చు. కానీ ఇలాంటి వింత గ్రామం భూమ్మీదే ఉంది. అక్కడి వాతావరణం కూడా చాలా విచిత్రంగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ ప్రదేశం ఎక్కడో తెలుసుకుందాం.
భూమి యొక్క ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ‘అల్-హుతైబ్’ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వాతావరణం ఎంత వింతగా ఉంటుందంటే శీతాకాలంలో రాత్రి కాగానే ఎముకలు కొరికేసే చలి పెడుతుంది. తెల్లవారగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేస్తాడు. తట్టుకోలేనంత వేడిని సృష్టించేస్తాడు.
సాధారణంగా మన భూమి మీద ఉన్న వేడి కంటే అక్కడ అధికంగా వేడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి చలికాలంలోనే ఇంత వేడి ఉంటే మరి వేసవి కాలం సంగతి ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా.. ఇప్పటివరకు ఆ గ్రామంలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదంట. అయినప్పటికీ ఆ గ్రామాన్ని వీక్షించడానికి ఎందరో పర్యాటకులు వస్తూనే ఉంటారు.
అక్కడ ఉండే పురాతన నిర్మాణాలు, ఆధునిక నిర్మాణాలు చూడముచ్చటగా, చూపరులకు కనువిందు చేసేలాగా ఉంటాయి. ఇక్కడ ఆల్ బోహ్రా లేదా అల్ ముకర్మా అనే జాతి ప్రజలు నివసిస్తారు. మరి ఆ గ్రామంలో వర్షం కురవక పోవడానికి కారణాలు ఏంటి.. వర్షం ఎలా కురుస్తుంది మనకు ఒక అవగాహన ఉంది కదా.. మేఘాల కింద గ్రామం ఉంటే మేఘాల నుంచి వర్షం కురుస్తుంది. కానీ ఈ గ్రామం భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మేఘాల పైన ఈ గ్రామం ఉందని అర్థం.
అలాంటప్పుడు అక్కడ వర్షం కురిసే చాన్సే లేదు. కాబట్టి వర్షం కురవడాన్ని ఆ గ్రామంలోని ప్రజలు పై నుండి వీక్షిస్తారు. చెప్పుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది కదా.. కానీ అక్కడి ప్రజలు ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఆ వేడిని తట్టుకుంటూ జీవిస్తున్నారంటే వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేము.