Amazing News : చెట్లు లేకుండా అసలు మనిషి జీవించగలడా..చెట్టు లేని నేల ఉంటుందా..అలాంటి ఊరిని మనం ఉహించుకోవచ్చునా..ఒక్క చెట్టు లేని దేశాలు రెండు ఉన్నాయి. ఆ దేశాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.
ఒక చెట్టు కూడా లేనటువంటి దేశాల్లో మొదటి దేశం గ్రీన్లాండ్. గ్రీన్ లాండ్ అంటే అందరూ ఆకుపచ్చని ప్రవేశం, దట్టమైన అడవితో నిండి ఉంటుంది, పచ్చని ప్రకృతిని ఆస్వాదించవచ్చు అని భ్రమ పడుతూ ఉంటారు. వాస్తవానికి గ్రీన్ ల్యాండ్ లో వేలమైళ్ళ భూమిలో ఒక చెట్టు కూడా ఉండదు. వృక్ష సంపద లేని దేశంలో అతి ముఖ్యమైనది గ్రీన్ లాండ్.
ఒక చెట్టు కూడా లేనటువంటి దేశానికి గ్రీన్ లాండ్ అని పేరు ఎందుకు పెట్టారంటే దాని వెనక ఓ పెద్ద చరిత్ర దాగి ఉంది.ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం. ఎక్కువమంది ఆ మంచు వల్ల అక్కడ నివసించలేరు. గ్రీన్ లాండ్ పేరు వినగానే పచ్చని ప్రదేశం అనుకొని అక్కడ నివసించడానికి ప్రజలు వస్తారనే ఒక నమ్మకంతో ఆ దేశానికి ఆ పేరు పెట్టారు.
ప్రపంచంలో ఒక్క చెట్టు కూడా లేనటువంటి మరో దేశం పేరు ఖతార్. ఇక్కడ చెట్లు లేకపోయినప్పటికీ కూడా ఖతార్ అత్యంత సంపన్నమైన దేశంగా గుర్తింపబడింది. అతిపెద్ద విమానయాన సంస్థలను ఖతార్ కలిగి ఉంది. పెద్ద ,పెద్ద గృహాలను కలిగి ఉన్న ఈ ధనిక దేశంలో ఒక చెట్టు కూడా లేకపోవడం గమనార్హం.
ఖతార్ ఎడారి ప్రాంతం ఎటు చూసినా కూడా ఖాళీ స్థలం దర్శనమిస్తుంది. ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువగా కురుస్తాయి. ఇక్కడి ప్రజలు 40 వేలకు పైగా చెట్లతో మానవ నిర్మిత అడివిని నిర్మిస్తున్నారు.