Auroville City : భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతుల, సాంప్రదాయాల రకరకాల కులాల, మతాల మేలవింపు. భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, కులాలు ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు. అయితే ఒక నగరంలో మాత్రం కులం ,మతం అలాగే డబ్బు కూడా అవసరం లేకుండా జీవించేస్తున్నారు. ఆ నగరం ఎక్కడుంది.. దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వ హయాంలో లేనటువంటి ఒక నగరం డబ్బులు లేకుండా జనజీవనాన్ని నడిపిస్తుంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ తినడానికి, నివసించడానికి కూడా ఎటువంటి డబ్బు అవసరం లేదు. అలాంటి నగరం మరి ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. ఈ నగరం తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చెన్నై నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం పేరు “ఆరోవిల్”. ఈ నగరాన్ని స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం.. అంటరానితనం, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు సమానంగా జీవించడమే.
ఇలాంటి అద్భుతమైన నగరాన్ని 1968 లోనే స్థాపించారు. ఈ నగరాన్ని మీరా అల్పాస్ అనే ఆమె 1914లో పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఆమె తిరిగి మళ్లీ జపాన్ వెళ్లిపోయారు. అయితే 1920లో మళ్లీ తిరిగి వచ్చిన ఆల్ఫాస్ 1924లో అరబిందో స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్లో చేరి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.
ఈ ఆరోవిల్ నగరానికి యూనివర్సల్ సిటీ అని కూడా పేరు కలదు. ఈ నగరంలో ఎవరైనా ఎక్కడి నుండైనా వచ్చి జీవించవచ్చు. ఇక్కడి సమాచారం ప్రకారం ఈ నగరంలో ఇప్పటివరకు 50 దేశాల నుండి ప్రజలు వచ్చి నివసిస్తున్నారు. అంటే అక్కడి జనాభా సుమారుగా 24000. ఈ గ్రామంలో నివసించాలంటే ఒకే ఒక్క షరతు ఉంది. అదేమిటంటే అక్కడ ప్రతి ఒక్కరు సేవకుడిగా మాత్రమే నివసించాలి.
ఈ గ్రామంలో మతం, కులం, దేవుడు, డబ్బులు లాంటివి ఏమీ ఉండవు. అందరూ సమానంగా జీవిస్తారు. ఇక్కడ ఎటువంటి దేవతలకు పూజలు జరగవు. ఇక్కడ మాతృ మందిరం అని పిలవబడే ఒక ఆలయం మాత్రమే స్థాపించబడి ఉంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ధ్యానం, యోగా వంటివి చేస్తారు.