Bairabi Station : భారతదేశంలో ఇండియన్ రైల్వే వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యత కలది. కోట్లాదిమంది ప్రజలకు ప్రతిరోజు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ.. రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద భారతీయ రైలు సేవలుగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. భారతదేశంలో రైల్వేవ్యవస్థ వ్యాపించని స్థలం లేదంటే అతిశయోక్తి కాదు. రైల్వే వ్యవస్థ అంతలా తన నెట్వర్క్ ను విస్తరింపజేసింది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం గమనించాలి. ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఆ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ నే ప్రజలు రవాణా సౌకర్యానికి వినియోగించుకుంటున్నారు. అది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. భారతదేశంలో 8 వేలకు పైగా రైల్వేస్టేషన్ లు ఉన్నాయి. కానీ ఈ ఒక్క రైల్వేస్టేషన్ ఒక్క రాష్ట్రానికి చెందింది అని చెప్పడం కాస్త విస్మయానికి గురిచేసే అంశమే.
ఆ రైల్వే స్టేషన్ మిజోరం రాష్ట్రంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు భైరాబి రైల్వే స్టేషన్. మిజోరం జనాభా దాదాపు 11 లక్షల పై చిలుకె. కానీ ఇక్కడ ఒకేఒక్క రైల్వే స్టేషన్ ఉండటం గమనార్హం. ఈ రైల్వే స్టేషన్ BHRB. ఇది రాష్ట్రంలోని కొలాసిబ్ జిల్లాలో కలదు. ఈ రైల్వే స్టేషన్ నుండే ప్రజలు రాకపోకలతో పాటు రవాణా వ్యవస్థ కు కూడా ఆధారపడుతున్నారు. 2016లో ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేశారు. అంతకుముందు ఇంకా చాలా చిన్నదిగా ఉండేది. ఈ స్టేషన్ లో మూడు ప్లాట్ ఫామ్ లు,నాలుగు రైల్వేట్రాక్ లు ఉంటాయి.
రాష్ట్రంలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉండడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడి ప్రభుత్వం మరో స్టేషన్ నిర్మించే ఆలోచన చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం వస్తున్న సమాచారం.. ఇక్కడ అతి త్వరలోనే రైల్వేవ్యవస్థ వృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అలా జరిగితే అక్కడి ప్రజల ఇబ్బందులు తీరిపోయినట్లే.