Bala Subrahmanyam : ఆ పాట పంచామృతమై అమృతాన్ని పంచింది. ప్రతి పల్లవి అ గొంతులో పల్లవించి పాటగా ప్రతిధ్వనించాలని ఆరాట పడతాయి. పండిత పామర ఆరాధ్యుడు ఈ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. ఆదే పాట ప్రతీ చోట నేటికి వినిపిస్తోంది. నువ్వు భౌతికంగా లేవన్న లోటును నీ పాట తీరుస్తోంది. కెరటానికి అరాటం తీరం చేరాలని ఆలాగే ప్రతి పాట నీ గళం నుంఛి జాలువారాలని కోరుకుంటుంది.
స్పటిక అంత స్వచ్చమైన మాట ,పటిక బెల్లం లాంటి తియ్యనైన నీ స్వరం, పండు వెన్నెల కురిపింస్తుంది. హృదయాన్ని మైమర పిస్తుంది. నువ్వు నారద తుంబుర నాదామృతానివా లేద మాకోసం ఈ భువిలో విరిసిన గాన పారిజాతానివా.. ప్రతి పాట స్వరపరిమళం. అది గాన సరస్వతికి సమర్పించిన పాటల హారతి పళ్ళెం. గాన గంధర్వునికి ఆక్షర నివాళి.