Billionaire Barbar Ramesh Babu : రమేష్ బాబు చాలా పేదవాడు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు. తల్లి ఎంతో కష్టపడి చదివించింది. రమేష్ బాబు తండ్రి అతని చిన్నతనంలోనే చనిపోయాడు. రమేష్ బాబు పదవ తరగతిలోనే చదువు ఆపేసి కూలీ పనులకు వెళ్ళాడు. తల్లికి తోడుగా కుటుంబ జీవనోపాధి కోసం రమేష్ చాలా ఉద్యోగాలు చేసాడు కానీ కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది.
మరి బిలినీయర్ గా ఎలా ఎదిగాడు..
రమేష్ బాబు తండ్రి బెంగళూరులో ఒక క్షురకుడుగా పని చేసేవాడు. ఆయన అకస్మాత్తుగా మరణించిన తర్వాత తన తల్లి బార్బర్ షాప్ తోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది కానీ వచ్చే ఆదాయం ఎటు సరిపోకపోయేది. వచ్చిన ఆదాయంలో పిల్లలను చదివిస్తూ ఇంటికి అద్దె కడుతూ జీవించడం ఆమెకు ఒక పెద్ద సవాల్ గా మారిపోయింది.
ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో రమేష్ న్యూస్ పేపర్ డెలివరీ, మిల్క్ హోమ్ డెలివరీ లాంటి పనులు చేసి కుటుంబ పోషణలో తల్లికి ఆసరాగా ఉండేవాడు. తరువాత రమేష్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, తండ్రి పాత దుకాణం ‘ఇన్నర్ స్పేస్’ లో బార్బర్‌గా పని చేయడం మొదలెట్టి. పట్టుదలతో కష్టపడి అతి త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ గా మారిపోయాడు.
హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు తెచ్చుకున్న రమేష్ ఆ తర్వాత 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొన్నాడు. కానీ రమేష్ కి ఆ కారు EMI కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంటే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో, తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొస్తూ ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
అది లాభసాటిగా అనిపించడంతో, పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇక అప్పటినుంచి రమేష్ బాబు వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.
తన దగ్గర ఉన్న 600 కార్ల కలెక్షన్‌ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్, బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే. బిలియనీర్ బాబుగా రమేష్ పాపులర్ అయ్యాడు.
ముప్పై సంవత్సరాలుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూ.. అలా 600కు పైగా కార్లను పోగు చేసాడు. దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు వ్యాన్లు, మినీ బస్సులు కూడా రమేష్ దగ్గర ఉన్నాయి.
రమేష్ బాబు కంపెనీలు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో ఉన్నాయి. అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ లాంటివాళ్లతో పాటు బిజినెస్ మాన్స్, పారిశ్రామికవేత్తలు కూడా సిటీకి వచ్చినప్పుడు రమేష్ బాబు దగ్గర ఉన్న కార్లు అద్దెకు తీసుకుంటారంట.
బిగ్ సెలబ్రిటీల దగ్గర ఉన్న ప్రతి ఒక్క కార్ ను కూడా రమేష్ బాబు డ్రైవ్ చేయగలడు. అన్నట్టు రమేష్ ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు అయిన రమేష్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్లోనే తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం కదా… 2 బిలియన్ డాలర్ల నెట్వర్క్ తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్‌గా పేరు పొందాడు రమేష్ బాబు.