Brahmaputra River : మన భారతదేశంలో నదులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. నదులను తల్లితో సమానంగా,చాలా పవిత్రంగా మన భారతదేశంలో కొలుస్తారు. అందుకే ఇప్పటివరకు ఉన్న నదులకు స్త్రీ పేర్లనే పెట్టారు. నదులలో ముఖ్యంగా సరస్వతి, గంగ, యమునా, కృష్ణ, గోదావరి నదులు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క నది కూడా స్త్రీ యొక్క పేర్లు కలిగి ఉన్నాయి.
కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజులలో భక్తులు ఈ నదులలో ప్రత్యేక స్నానాలు ఆచరించి దైవదర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలను కూడా ఈ నదులకు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నదులను శక్తిస్వరూపాలుగా పరిగణిస్తారు. అలాగే పురుష పేరుతో కూడా ఒక నది ఉందని మీకు తెలుసా.?బ్రహ్మపుత్ర పేరుతో మన భారత దేశంలో ఒక నది ఉంది. ఈ నది అత్యంత శోభను కలిగి ఉంది.
ఈ నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ నదిలో స్నానమాచరించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల ప్రకారం విశ్వాసం. బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేస్తే శారీరక బాధల నుండి దోషాల నుండి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. బ్రహ్మపుత్ర నది వెనుక పురాణ గాథ ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడు మహా ఋషి అటువంటి బ్రహ్మదేవుడు శంతనుడి భార్య అమోఘ అందానికి మంత్రముగ్దుడై వివాహం చేసుకుంటాడు.
ఆ ఇద్దరికి ఒక కొడుకు జన్మిస్తాడు. అతడే ఇలా నదిలా ప్రవహిస్తాడని ఒక పురాణ కథ రాసి ఉంది.ఆ నదికి అందుకే బ్రహ్మపుత్రుడు అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. భారత దేశంలో ఈ నది 2009 వందల కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుందని, చైనాలోని టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం ఈ నదికి పుట్టినిల్లు అని చెబుతారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ప్రవాహం మూడు రోజులపాటు రక్తంలాగా ఎర్రగా కనిపిస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ బ్రహ్మపుత్రానది భారత్ లోకి ప్రవేశించి తర్వాత అస్సాం మీదుగా ప్రయాణిస్తూ బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రదేశంలో బ్రహ్మపుత్ర నది రెండు పాయలుగా విడిపోయి, ఒక పాయ దక్షిణ వైపుగా, మరో పాయ జమునా నది పేరుతో గంగా నదిలో కలుస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నదికి పద్మావతి నది అని ఇంకొక పేరు కూడా కలదు. బ్రహ్మపుత్ర నది మరొక పాయ మేఘన నదిలో కలుస్తుంది. ఈ నదులన్నీ బంగ్లాదేశ్ లోని చాంద్పూర్ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తాయి.