Chinese spy balloons: గుబులు రేపుతున్న చైనా బుగ్గలు..
అగ్రరాజ్యం అమెరికా గగన తలంలో చైనా స్పై బెలూన్లు ఎగరడం కలకలం రేపుతోం ది. నిఘా బెలూన్ల వ్య వహారం అమెరికా, చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిం దే. చైనాకు చెందిన నిఘా బెలూన్ల స్పై బెలూన్ తమ దేశ రక్షణ స్థావరాలపై నిఘా పెడుతోం దన్న కారణం తో ఫైటర్ జెట్‌తో అమెరికా రక్షణ దళాలు ఆ బెలూన్ను పేల్చే శాయి.
వాతావరణ మార్పుల అధ్యయనానికి సంబంధించినదని చైనా రక్షణ వర్గాలు తెలిపినా బెలూన్ కూల్చివే సిన తర్వాత ఆ శకాలాలలో నిఘా పరికరాలు సమాచారాన్ని చేరవేసే వ్యవస్ద ఉన్నట్లు ఆమెరికా రక్షణ వర్గాలు గుర్తించి వాటికి సంబంధించిన చిత్రాలను బహిర్గతం చేయడం వల్ల తేలు కుట్టిన దొంగ మాదిరి చైనా మౌనంవహిస్తోంది.
Also Read: అక్కడ నాపై కోడిగుడ్లు విసిరారు.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్!
గగనతలంలో అనుమానాస్పద వస్తువుల కదలికలు అమెరికా ను కలవరపెడుతున్నాయి. నింగిలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును అగ్రరాజ్యం కూల్చేసింది.మిచిగాన్ రాష్ట్రంలోని హ్యూరన్ సరస్సుపై ఆదివారం 20వేల అడుగుల ఎత్తులో కన్పించిన ఆ వస్తువును ఎఫ్-16 యుద్ధ విమానంతోకూల్చేసింది నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా.. మరిన్ని దేశాలను లక్ష్యం గా చేసుకుందనే సమాచారం.
అగ్రరాజ్యమ్ ఆందోళన చెందినవేళ భారత దేశం పరిస్దితి ఏమిటన్న ఆంశం అశక్తిని రేపుతోంది. క్షిపణి విధ్వంసక వ్యవస్దను రూపొందించుకున్న భారత్ కు ఈ విషయం చాల చిన్నది. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోమని ప్రభుత్వం కృత నిశ్ఛయంతో ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్ లోయలో విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్న తరుణంలో భారత చైనా దౌత్య సంబంధాలకు తీవ్ర విఘాతం ఎర్పడింది. భారత అంతర్గత వ్యవహారంలోనూ సరిహద్దు విషయంలోనూ అతిగా మితిమీరి జ్యోక్యం చేసుకోవద్దని ఆనేక మార్లు చైనాను హెచ్చరించింది.
Also Read : నెల్లూరు జనసేన – కేతంరెడ్డి vs మనుక్రాంత్ రెడ్డి
విశ్వ వేదికలపై చైనా దమన దౌత్య నీతిని తూర్పార బట్టింది . అయినా కాని చైనా తన వైఖరి మార్చుకోలేదు. సరిహద్దు సమీపంలో నిఘా బెలూన్ల ను వినియోగించి రక్షణ స్దావరాల వివరాలను సేకరించే పనిలో నిమగ్న మైంది. చైనా కుతంత్రాన్ని పసిగట్టిన భారత్ ముందే వాటిని ఎదుర్కోవడానికి కార్యచరణని సిద్దం చేసింది. కార్గిల్ యుద్దం నేర్పిన అనుభవాలు కార్గిల్ యుద్దం తర్వాత ఏర్పడీన రివ్యూ కమిటీ ప్రభుత్వానికి చేసిన సూచనలతో భారత ప్రభుత్వం సరిహద్దుల్లో నిఘా కోసం ఈ స్పై బెలూన్లను కొనుగోలు చేసింది. వీటిని సరిహద్దుల్లో నిఘా కోసం వినియోగించారు. అయితే భారత్ ఎప్పుడూ సరిహద్దుల వరకే వీటిని వినియోగించింది.
ఈ బెలూన్లు ఎప్పుడూ సరిహద్దులు దాటి వెళ్ళలేదు. స్పై బెలూన్ల నిర్వాహణ శత్రు దేశ స్పై బెలూన్ల విధ్వంస వ్యవస్ద వాటిని నిర్వీర్యం చేయడంలో సాంకేతికను వినియోగించి ఆ దిశగా సైనికులకు శిక్షణ నిచ్చింది నిఘా బెలూన్ల కదిలకలను రాడార్ ద్వార కనిపెట్టి వాటిని నియంత్రించే పరికరాలను సైన్యానికి అప్పజెప్పింది. సరిహద్దు , గగన తల నియమాలను అతిక్రమిస్తే వాటిని ధ్వసం చేయటానికి ప్రత్యేక డ్రోన్ వ్యవస్దను సిద్దపరచింది. ఆత్మ నిర్బరంతో స్వావలంబనతో , అత్యాధునిక సాంకేతికత అయుధ సంపత్తి యుద్దవిమానాలు సుశిక్షుతులైన సైన్యం వల్ల శత్రు దుర్బేధ్యంగా మారింది భారత రక్షణ వ్యవస్ద. అసూయతో అక్కసుతో వ్యవహరించే చైనా చర్యలను తిప్పి కొట్టగలదు భారత్ . ప్రస్తుత తరుణంలో భారత్ ముందు చైనా ప్రదర్శించేది మేకపోతు గాంభీర్యం. వాస్తవికత ఏమిటో చైనాకు తెలియంది కాదు . ఆంతర్జాతీయంగా సమస్యలు ఎదుర్కోంటున్న చైనా ప్రపంచ దేశాల దృష్టి మరల్చటానికి పన్నిన ఎత్తు గడే ఈ నిఘా బుగ్గ..
శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు
