Clock : ఎప్పుడైనా రెండు గడియారాల ముందు సమయాన్ని వేరువేరుగా ఉండడం గమనించారా..కానీ ఒక దేశంలో మాత్రం ఒక చర్చి ముందు ఉన్న రెండు గడియారాల్లో సమయాన్ని వేరువేరుగా చూపిస్తుంది. ఆ దేశం ఏంటి.. ఆ చర్చ్ వెనుక ఉన్న వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాల్టా ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో ఒకటి.
ఇక్కడ జనాభా 5.2 లక్షలు మాత్రమే అక్కడ దాదాపు 360 చర్చిలు ఉండడం విశేషం. ఇక్కడ చర్చి ముందు రెండు గడియారాలు ఎందుకు పెడుతున్నారు, అనే సందేహంలో చాలామంది రకరకాల కథనాలు వినిపిస్తూ ఉంటారు. చరిత్రకారుల,స్థానికులు చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారం, దయ్యాలు వచ్చినప్పుడు అవి గందరగోళ స్థితిలోకి వెళ్లడానికి ఇలా గడియారాలు పెట్టారని చాలామంది విశ్వసిస్తున్నారు.
చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దయ్యాలు అక్కడికి వస్తే అవి గందరగోళ పరిస్థితుల్లోకి ఆ గడియారం చూసి నెట్టు వేయబడతాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ నివసించే ప్రజలు మాత్రం చర్చిలో మోగించే గంటల శబ్దాన్ని బట్టి ప్రార్థనలకు వస్తూ ఉంటారు. కొంతమంది వాదన ఇలా ఉంటే మరి కొంతమంది ఈ వాదనను ఖండిస్తారు. ఈ రెండు గడియారాలను రైతులు, మత్సకారులు కోసం ఏర్పాటు చేశారని చెప్తారు.
అందులో ముందుగా సమయాన్ని చూపించే గడియారం రైతుల కోసమని, దాని ఆధారంగానే వారు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లడం జరుగుతుందని చెబుతారు. ఇంకో గడియారం చేపలు పట్టే జాలర్ల కోసమని వారు చెబుతున్నారు. జాలర్లు సమయంతో సంబంధం లేకుండా అలల తాకిడి, రుతుపవనాల ఆధారంగానే చేపల వేటకు సముద్రంలోకి వెళుతూ ఉంటారు.
మరికొందరు ఈ గడియారాల్లో ఒకటి స్థానిక సమయాన్ని సూచిస్తుందని, మరొకటి రోమ్ సమయాన్ని చూపిస్తుందని..ఇలా ఒక్కొక్కరు ఒక విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.18వ శతాబ్దంలోని ఈ సాంప్రదాయం మొదలైందని ఇంకొంతమంది ప్రగాఢ నమ్మకం. ఆ దేశంలో ఉన్న దుష్టాత్మలను తరిమికొట్టడానికి ఈ రెండు గడియారాలు పెట్టారని స్థానికంగా ఉన్నటువంటి జానపద సాహిత్యం పేర్కొంటుంది. 18వ శతాబ్దంలో మాల్ల్టాలోని ఒక గ్రామం లో అంటువ్యాధులు, ఆకస్మికంగా మరణాలు,
పంటలు పండక పోవడం లాంటివి వరుసగా జరుగుతున్న క్రమంలో తమ ఊరికి ఏదో దుష్టశక్తి ఆవహించిందని ఆ ఊరి మతాధికారి వద్దకు వెళ్లారు అంట, దీనికి పరిష్కారంగా ఆయన ఆ ఊరిలోని కూడలిలో రెండు గడియారాలు ఏర్పాటు చేయాలని సూచించారని చాలామంది చెబుతుంటారు. అలా చేసిన తర్వాతనే ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలని తీరిపోయాయని ఆ గడియారాలు వెనక అసలు కథ ఇది అని ఇంకొక కథనం కూడా ప్రచారంలో ఉంది.