Different Types of Tears : అందరికీ కన్నీళ్లు రావడం సహజం. కానీ ఆ కన్నీళ్లు ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో వస్తూ ఉంటాయి. సహజంగా మనం కొన్ని భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఆనందానికి,బాధకు కన్నీళ్లు వస్తాయి. అలాగే మన కూరల్లో ఉపయోగించే ఉల్లిపాయలు కోసినప్పుడు కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇన్ని రకాల కన్నీళ్లు ఒకటే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే… కన్నీళ్లలో కూడా రకాలు ఉన్నాయి అంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా… ఆ రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్నీరు కంటిని రక్షిస్తుంది. అలాగే ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే భావోద్వేగాల వల్ల వచ్చే కన్నీరు శరీరానికి తగిన పోషకాలు అందిస్తుందని డాక్టర్ మైఖేల్ రోయిజెన్ అంటున్నారు. కన్నీళ్ళ వల్ల ఒక వ్యక్తికి ఒత్తిడి దూరం అవుతుంది అని,దుఃఖం ,సంతోషం, భయం లేక ఇతర భావోద్వేగాలను అనుభవించినప్పుడు కన్నీటిలో ఉండే అదనపు హార్మోన్లు, ప్రోటీన్లు వెళ్లాడవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
భావోద్వేగాలతో వచ్చిన కన్నీళ్లు వివిధ రకాల పరమాణువులను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఈ విధానం కనిపించిందని “దీ పోటోగ్రఫీ ఆఫ్ టీయర్స్” పుస్తకం కోసం ఫోటోగ్రాఫర్ రోజ్ -లిన్ ఫిషర్ తీసిన ఫోటోలు వీటికి ఆధారంగా కనిపిస్తున్నాయి. “కన్నీళ్ల దృశ్య పరిశోధన” కోసం ఫిషర్ డిజిటల్ మైక్రోస్కోపీ కెమెరాలో ఆప్టికల్ స్టాండర్డ్ లైట్ మైక్రోస్కోప్ని ఉపయోగించి కొన్ని ఫోటోలను తీసారట.
భావోద్వేగాలతో కూడిన కన్నీటిని ఎనిమిది సంవత్సరాలు ఈ ప్రాజెక్టు కోసం రోజ్ లిన్ ఫిషర్ సేకరించి ఫోటోలు తీశారు. కన్నీళ్లు రకరకాలుగా ఉండడం చూసిన ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. బాధలో ఉన్నప్పుడు, ఆనందం కలిగినప్పుడు వచ్చేటటువంటి కన్నీళ్లు ఒకే రూపాన్ని కలిగి ఉండగా.. దుఃఖం, నవ్వు అలాగే ఉల్లిపాయలు తరిగినప్పుడు వచ్చే కన్నీరు మాత్రం వేర్వేరు రూపాలు కలిగి ఉన్నాయని ఆమె వెల్లడించారు.
ఈ ప్రక్రియకు శాస్త్రీయ ఆధారాలు ఏవి లేవంటూ చాలామంది దానిని కొట్టివేశారు. ఎందుకంటే రోజ్ లిన్ సైంటిస్ట్ కాదు. ఆమె కేవలం ఒక విజువల్ ఆర్టిస్టు మాత్రమే. కాబట్టి ఆమె చేసినటువంటి ఈ ప్రాజెక్టు సరైనది కాదు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఆమె కేవలం ఆసక్తితో మాత్రమే ఈ ప్రాజెక్టు చేసిందని సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు కన్నీళ్లు విభిన్నంగా కనిపించాయని వారు వెల్లడించారు. ఈ విషయంపై సమగ్ర పరిశోధన జరిగితే అసలు విషయం తెలుస్తుందని వారు తెలిపారు.