Divorce of Birds : విడాకులు అనేవి ఎవరు తీసుకుంటారు..ఇద్దరి దంపతుల మధ్య మనస్పర్ధలు, సమస్యలు వచ్చినప్పుడు విడాకులు తీసుకుంటారు..కదా.. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయంట.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది వాస్తవం అని అధ్యయనాలు చెబుతున్నాయి. పక్షుల మధ్య విడాకులు తీసుకునే సందర్భాలు ఎలా వస్తాయి అంటే..
ఒక పక్షిని వదిలి ఇంకో పక్షి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, రెండు పక్షుల మధ్య ఎక్కువ దూరం పెరిగినప్పుడు, సంతానోత్పత్తి కోసం వేరే భాగస్వామితో జత కట్టినప్పుడు, వీటి మధ్య దూరం పెరుగుతుందనే భావన ఏర్పడుతుందని జర్మనీకి చెందిన పరిశోధకులు చెప్తున్నారు. మనం సాధారణంగా గమనించినట్లయితే పక్షులన్నీ ఒకే గుంపుగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి.
అవి ఆకాశంలో ఎగిరినప్పుడు కానీ, ఆహారం సేకరించే సమయంలో కానీ ఎక్కువ శాతం మనకు గుంపుగానే కనిపిస్తాయి. అయితే దాదాపు 90% పక్షిజాతులు గుంపు విధానాన్ని పాటిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో సంతాన ఉత్పత్తి జరిగే సమయంలో ఒకే భాగస్వామినీ కలిగి ఉంటాయి. అయినప్పటికీ కొన్ని పక్షులు ఆహార సేకరణ కోసం వాతావరణ పరిస్థితిని బట్టి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతూ ఉంటాయి.
అలా వెళ్ళినప్పుడు మునుపటి భాగస్వాములను విడిపోవడం జరుగుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త భాగస్వాములతో మళ్ళీ జతకడతాయి. ఇలా వెళ్ళినప్పుడు మగపక్షుల్లో లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్ అనేది జరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఆడ, మగ పక్షులు విడిపోవడానికి మొదటి ప్రధాన కారణంగా పరిశోధకులు దీనినే చూపుతున్నారు.
పరిశోధకులు అధ్యయనంలో భాగంగా 232 పక్షి జాతుల మీద అధ్యయనం చేసినప్పుడు వలసలు, మీటింగ్ బిహేవియర్ డేటాను వారు క్షుణ్ణంగా పరిశీలించి చివరికి ఇలాంటి నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ప్లోవర్స్, స్వాలోస్, మార్టిన్స్, ఓరియోల్స్ అండ్ బ్లాక్‌బర్డ్స్ లాంటి కొన్ని పక్షి జాతులు ఎక్కువగా హై డైవోర్స్ రేట్ కలిగి ఉంటాయని వారు వెల్లడించారు.