England : ఈ సృష్టిలో దైవం,దయ్యం రెండూ ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు. కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. కొంతమందికి దుష్టశక్తి ఆవహించిందని,లేకపోతే కొన్ని కొన్ని స్థలాలలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయని. ఇలాంటివి ఏవో ఒకటి రోజు మన చెవిన పడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోపోయేది మాత్రం వింతల్లో వింత.
ఒక హోటల్ నీ దయ్యాలు నడపడం అనేది మీరు ఎక్కడైనా విన్నారా.. వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.. వాస్తవానికి ఒక హోటల్ మొత్తాన్ని దయ్యాలు నడుపుతున్నాయి. ఆ వింత ఏమిటో.. ఆ హోటల్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హోటల్ పేరు హాంటెడ్ హోటల్. ఈ హోటల్ ని దయ్యాలే నిర్వహిస్తాయి. ఈ హోటల్ కి దయ్యాలు కాపలాగా ఉంటాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.
దీనిని కాజిల్ బ్రోమ్విచ్ హాల్ 1557,1585 మధ్య నిర్మించారనీ, ఇది ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ హోటళ్లలో ఒకటిగా గుర్తింపు పొందిందని చెప్తుంటారు. పారానార్మల్ పరిశోధకులు ఒక రాత్రి మొత్తం ఈ హోటల్లో బస చేశారు. ఈ హోటల్లో చాలా ఆత్మలు ఉన్నాయని వారు తెలపడం ఇక్కడ గమనార్హం.
వారు చెప్పిన వింత విషయాలు వింటే మనమూ ఆశ్చర్య పోవాల్సిందే. ఆ హోటల్ తలుపుకు కాపలాగా అక్కడ దయ్యాలు ఉన్నాయంట. హోటల్లోకి వెళ్ళేటప్పుడు దయ్యాలు మనల్ని ఒక ప్రశ్న వేస్తాయంట. మనం స్నేహితులమేనా అని దయ్యం ప్రశ్నించగా.. అవును అని వీరు సమాధానం చెప్పారంట అలా చెప్పిన తర్వాతనే వీళ్ళని లోపలీకి ఆ దయ్యాలు అనుమతించాయనీ ఆ పరిశోధకులు తెలిపారు.
అంతేకాదు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఈ ఘటనను వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో చూస్తే వారు తలుపు దగ్గరగా వెళ్ళగానే మూసి ఉన్న తలుపులు ఒక్కసారిగా అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. దయ్యాలు వీరితో చేసిన సంభాషణ కూడా మొత్తం వీడియోలో రికార్డ్ అయింది.