Ganavi Laxman Birthday Special : శాండల్‌వుడ్ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు టాలీవుడ్‌కు వచ్చి స్టార్స్ అయ్యా రు. ఇప్పుడు మరోనటి తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. తనే గనవి లక్ష్మణ్. గానవి 1992 జూలై 04 కర్ణాటకలోని చిక్క మంగళూరులో పుట్టి పెరిగింది. డిగ్రీ పూర్తి కాగానే తన కిష్టమైన డ్యాన్స్ లోనే కెరీర్‌ను ఎంచుకుంది. మొదట్లో కొన్ని బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. సినిమాల్లో అవకాశం కోసం చాలా ఆడిషన్స్ లో పాల్గొంది. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన హిట్ సినిమా ‘కిరాక్‌పార్టీ’లో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చిందట.
కానీ ఎంపిక కాలేదు. ఆ సినిమాతోనే రష్మిక మందనా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా మారింది. బెంగళూరులో డ్యాన్స్ టీచర్‌గా కొన్నాళ్లు పనిచేసింది. ఈ క్రమంలో సినీనటులు పరిచయం కావడంతో తనకు నటి అవ్వాలన్న కోరిక కలిగిందట. ఆ సినిమా అవకాశం చేజారినా నిరాశపడి ప్రయత్నాలు ఆపలేదు. ఈ క్రమం లోనే బుల్లితెరపై నటించే అవకాశమొచ్చింది. తొలిసారిగా ‘మగలు జానకి’ సీరియల్లో ప్రధాన పాత్రపోషించి నటిగా మారింది.
ఆ సీరియల్లో టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు తిరిగి రిషభ్ శెట్టి నటించిన ‘హీరో’లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం హిట్కావడంతో గానవికి గుర్తింపు లభించింది.ఆ తర్వాత ‘భవచిత్ర’, శివరాజ్‌కుమార్ ‘వేద’లోనూ నటించి స్టార్‌గా ఎదుగుతోంది. ‘రుద్రంగి’తో తెలుగులో నూతన ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమవుతోంది.
గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం రుద్రంగిలో గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో ఒక పాత్ర పోషిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్‌తో వేద, రిషబ్ శెట్టితో నాథూరామ్ సినిమాల్లో సరసన నటిస్తోంది. మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘రుద్రంగి’తో ఈమె.. టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది. ఈ మూవీ హిట్ తో టాలీవుడ్ లో గానవి మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు..