Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారం మూవీని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అవ్వగా తాజాగా విడుదలైన గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కి అందరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. అస్సలు ఈ సినిమాను మొదట ఈ ఏడాది ఆగస్ట్ లోనే విడుదల చేయాలనుకున్నారు కానీ
ఆ తర్వాత రిలీజ్ డేట్ ను జనవరికి మార్చారు. అప్పుడెప్పుడో స్టార్ట్ అయినా షూట్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ నెల ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ సెకండ్ వీక్ కి పోస్టుపోన్ చేశారు కానీ అప్పుడు కూడా షూట్ జరగడం డౌబ్ట్ గానే ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ మూవీ అంటేనే చాలామంది నటీనటులుంటారు. సినిమా ఆలస్యమవడంతో నటీనటులందరూ వివిధ చిత్రాలకు డేట్లు కేటాయించారని తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరామ్ వంటి నటీనటులు పలు భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో వీళ్ళందరి డేట్లు ఒక్క షెడ్యూల్ లో దొరకడం త్రివిక్రమ్ కు ఇప్పుడు కష్టమైన పనే. దీంతో ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యమవుతూ వస్తుంది. ఇవన్నింటికి అధిగమించి షూటింగ్ కంప్లీట్ చేయడం అన్నది గురూజీకి కత్తిమీద సాములాంటిదే. చూడాలి త్రివిక్రమ్ వీటన్నింటిని దాటి సంక్రాంతిలోపు షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తాడో..