Gympie-Gympie Plant : ఈ ప్రకృతిలో చెట్లు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో మనకు తెలుసు.. మానవుడి మనుగడకు చెట్లనుండి వచ్చే ఆక్సిజన్ చాలా అవసరం. అడవి పచ్చగా ఉంటే మనిషి జీవనం ఆనందంగా గడిచిపోతుందనడానికి పచ్చని చెట్లు ఎంతో నిదర్శనం. చెట్లు మనిషికి ప్రాణం పోస్తాయి. కానీ ఈ చెట్లల్లో కూడా మనిషి జీవితాన్ని ముగించేసే విషపూరితమైన చెట్లు ఉన్నాయని చాలా వరకు మనకు తెలియదు.
వాస్తవానికి మనిషిని చావుకు ఉసిగొలిపే చెట్లు కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి అని చెప్పడానికి ఆశ్చర్యపోనవసరం లేదు. మనిషి చావును కోరుకునే ఆ మొక్క పేరు జిపి-జిపి. ఈ మొక్క ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. ఈ మొక్కలు మనకు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉర్టికేసి రేగుట సంతతికి చెందినవి. ఈ మొక్క వల్ల మనుషులు, జంతువులు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు ప్రేరేపితం అవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ మొక్క వల్ల మనుషులు ఆత్మహత్యకు ఎలా ప్రేరేపింపబడతారు..? ఈ విషయాన్ని ఎలా నిర్దారించారు..? ఈ మొక్కను 1866 లోనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అప్పట్లో ఒక గుర్రం ఈమొక్కను తాకి కొద్దిసేపటికి అది మతిస్థిమితం కోల్పోయి మరణించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇంకో ఆచ్చర్యపోయే విషయం ఏమిటంటే.. అత్యంత ప్రమాదకరమైన ఈ మొక్కను యూకే కి చెందిన బ్రిట్ అనే వ్యక్తి తన పెరట్లో పెంచుకున్నాడు.
ఈ మొక్కను తాకినప్పుడు చర్మం మండడంతో పాటు, కరెంట్ షాక్ తగిలినట్టు తాకినవారికి అనిపిస్తుంది. అలా ఆ వ్యక్తికి ఆ నొప్పి కొన్ని నెలలపాటు ఉండడంతో, ఆ సమయంలో సదరు వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంటాడని పరిశోధనలో తేలింది. అయితే నొప్పి భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాంటి మొక్కల దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండడి.