• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

Hari Rama Jogayya :జనసేన – తెలుగుదేశం- బి.జె.పి ల విజయాలపై లెక్కలు ఏమి చెబుతున్నాయి..?

Hari Rama Jogayya

TrendAndhra by TrendAndhra
February 20, 2024
in Special Stories
243 10
0
Hari Rama Jogayya
493
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Table of Contents

Toggle
  • Hari Rama Jogayya : జనసేన – తెలుగుదేశం- బి.జె.పి ల విజయాలపై లెక్కలు ఏమి చెబుతున్నాయి..?
    • Hari Rama Jogayya : 2024 సం॥రంలో విజయవకాశాలపై 2019 ఎన్నికల లెక్కలు ఏమి చేబుతున్నాయి?
      • ప్రతికూలాలు – అవరోధాలు
      • అనుకూలం చేసుకోగలగటం

Hari Rama Jogayya : జనసేన – తెలుగుదేశం- బి.జె.పి ల విజయాలపై లెక్కలు ఏమి చెబుతున్నాయి..?

భారతదేశ ప్రాంతంగా చలి వణుకు పుట్టిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు చలి పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నాల్గు పార్టీలు అధికారం దక్కించుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకొని ఎన్నికల కదనరంగంలో దూకటానికి కాలు దువ్వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ప్రధాన పార్టీలుగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బి.జె.పి పార్టీలు ఈ పోటీలో ఉన్నాయి. రానున్న ఎన్నికలలో ఈ పార్టీల యొక్క విజయావకాశాలు ఏమిటి? వారికి ప్రస్తుతం కలిసి వచ్చే అంశాలు ఏమిటి? వారికున్న అవరోధాలు ఏమిటి?

Hari Rama Jogayya : 2024 సం॥రంలో విజయవకాశాలపై 2019 ఎన్నికల లెక్కలు ఏమి చేబుతున్నాయి?

2019 ఎన్నికలలో వై.ఎస్.ఆర్ పార్టీ 51 శాతం ఓట్లు దక్కించుకుని 151 శాసనసభా స్థానాలను గెలుచుకుంటే తెలుగుదేశం 40 శాతం ఓట్లు దక్కించుకుని 23 శాసనసభా స్థానాలను దక్కించుకొంటే జనసేన పార్టీ 6.9 శాతం ఓట్లు దక్కించుకుని 1 స్థానాన్ని దక్కించుకోగలిగింది. బి.జె.పి మాత్రం 0.9 శాతం ఓట్లను మాత్రమే దక్కించకోగలిగింది.

Pedana Constituency : పెడన సీట్ జనసేనదే..!!

2019 ఎన్నికలలో సుమారు 30 శాతం బి.సి.లు, 5 శాతం ఎస్.సి, ఎస్.టి.లు, 5 శాతం కాపుల ఓట్లు తెలుగుదేశం దక్కించుకోగల్గి 20 శాతం బి.సి.లు, 17 శాతం ఎస్.సి, ఎస్.టి.లు, 14 శాతం కాపుల ఓట్లు వై.ఎస్.ఆర్ పార్టీ దక్కించుకొని 2 శాతం బి.సి., ఎస్.సి., ఎస్.టి ఓట్లు, 5 శాతం కాపుల ఓట్లు జనసేన, 1 శాతం బి.జె.పి దక్కించుకోగల్గినాయని చెప్పవచ్చును. పంచాయితీ రాజ్ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ నుంచి తప్పకోవటంతో 40 శాతం ఉన్న తెలుగుదేశం ఓటర్ల సంఖ్య 35 శాతానికి పడిపోయిన మాట నిజం. పంచాయితీ రాజ్ ఎలక్షన్లలో వై. ఎస్. ఆర్ పార్టీర్ పడిన 14 శాతం కాపు ఓటర్లు నుండి 9 శాతం విడిపోయి జనసేనకు కలియటంతో జనసేన ఓటర్ల శాతం 6.9 శాతం నుండి 16 శాతం వరకు పెరిగిన మాట వాస్తవం. చంద్రబాబు అరెస్టు తర్వాత వారిపై సానుభూతి పెరగటంతో తెలుగుదేశం ఓటర్ల శాతం 35 శాతం నుండి 40 శాతానికి పెరగ్గా, వై.ఎస్.ఆర్ పార్టీ నుండి 9 శాతం కాపు ఓటర్లు జనసేనకు కలియటంతో వై.ఎస్.ఆర్ పార్టీ ఓటర్ల శాతం 42 శాతానికి పడిపోయిన మాట వాస్తవం.

Hari Rama Jogayya

 

ప్రస్తుత పరిస్థితి గమనించినట్లయితే సుమారుగా వై.ఎస్.ఆర్ పార్టీ 42 శాతం ఓటర్లతో, తెలుగుదేశం 40 శాతం ఓటర్లతో, జనసేన, 16 శాతం, బి.జె.పి 2 శాతం ఓటర్లతో ఎన్నికల బరిలో ఉన్నమాట కాదనలేం.

తెలుగుదేశం జనసేన కూటమి 50 శాతం ఓటర్ల సంఖ్య దాటి రాబోయే ఎన్నికలలో విజయానికి దగ్గరలో ఉన్న నిజాన్ని కాదనలేం.

ఐతే ఒకనాటి సంఖ్యాపరంగా ఈనాటి విజయావకాశాలను ఈ రూపంగా విశ్లేషించినా, ఈ సంఖ్యా బలం ఎన్నికలలో నిలబెట్టుకోవాలంటే తెలుగుదేశం, జనసేన, బి.జె.పి కూటమికి ఉన్న అవరోధాలు ఏమిటో,వాటిని దాటుకోటానికి తీసుకోవలసి వస్తే ఏ చర్యలు తీసుకోవలసి వస్తోందో విశ్లేషిద్దాం.

ప్రతికూలాలు – అవరోధాలు

1. పాత్తు ధర్మాన్ని పాటించక, శాసనసభా, పార్లమెంటు సీట్ల పంపకం, అధికార పంపకం, ఉభయపార్టీల కార్యకర్తల

సంతృప్తి మేరకు జరగక ఓట్ల ట్రాన్స్ఫర్ ఒకరి నుంచిమొరకరికి ట్రాన్స్ఫర్ కాకపోవటంతో జరిగే నష్టం.

2. వై.ఎస్.ఆర్ పార్టీ అమలు జరుపుతున్న సంక్షేమానికి మించిన సంక్షేమాన్ని అందించగలిగే ప్రక్రియలో ఓటర్లను ఆకర్షించలేకపోవటం.

3. ఎన్నికల రోజుల్లో ఓటర్లను ప్రలోభపెట్టే దిశగా తీసుకోవలసిన చర్చలలో వెనుకబడి ఉండటం,

4. ఆర్గనైజేషన్ లోపంతో ఎలక్షనీరింగులో వై. ఎస్. ఆర్ పార్టీని ఎదుర్కోలేకపోవటం.

5. ఎన్నికల పార్టనర్స్ అయిన తెలుగుదేశం, జనసన, బి.జె.పి నేతలపై అధికార పక్షం చేసే వివిధ ప్రజా వ్యతిరేక ఆరోపణలు వల్ల జరిగే నష్టం.

6) అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అనుసరించకపోవటం.

అనుకూలం చేసుకోగలగటం

1. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నట్లుగా రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నట్లుగా మూడవ వంతు 60 అసెంబ్లీ, 6 పార్లమెంటు నియోజకవర్గాలను తమకు కేటాయించవలసినదిగా జన సైనికులు కోరుతున్నారు. ఈ 60 నియోజకవర్గాలలో సుమారు 35 నియోజకవర్గాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు, 25 నియోజకవర్గాలు బి.సి, ఎస్.సి, యితర కులస్తులకు అనువైన అసెంబ్లీ నియోజకవర్గాలుగాను, బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు గాను గుర్తించడం జరిగింది. జనాభా ప్రాతిపదికన ఈ అసెంబ్లీ నియోజకవర్గాలతో బాటు 6 పార్లమెంటు నియోజక వర్గాలను సైతం జనననకు కేటాయించవలసినదిగా జన సైనికులు డిమాండు చేస్తున్నారు. నియోజక వర్గాలతో బాటు అధికారం 8న సైనికుల గౌరవానికి ఎటువంటి లోటు లేకుండా పంపకం జరగాలన్నదే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గార్కి పరిపాలనాధికారంలో వారి గౌరవానికి ఏ మాత్రం లోటు లేకుండా నియామకాలు జరగాలన్నది జన సైనికుల డిమాండు. ఈ డిమాండ్స్ పొత్తు ధర్మంలో భాగంగా సక్రమంగా జరిగితే జనసేన ఓట్లు సక్రమంగా తెలుగుదేశం అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉన్నమాట నిజం. అలాగే తెలుగుదేశం ఓట్లు జనసేన అభ్యర్థులకు సవ్యంగా ట్రాన్స్ఫర్ స్పష్టంగా అవ్వాలన్నా, తెలుగుదేశం నేత చంద్రబాబు గౌరవానికి ఏ మాత్రం తగ్గకుండా అధికార పంపిణీ జరగటం కూడ అంతే అవసరంగా చెప్పవచ్చు.

తెలుగుదేశం జనసేన కూటమితో బి.జె.పి పొత్తు ఈ కూటమికి లాభిస్తుందనే చెప్పవచ్చు

2. జనసేన – తెలుగుదేశం బి.జె.పి.ల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు వై. ఎస్.ఆర్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు కన్నా, మొండుగా ఉండి జనాకర్షణ కలిగి ఉండి, ఎక్కువ శాతం జనాభాకు చేరేవై ఉండి ప్రజలు వారికి అవసరంగా ఫీలై కోరుకుంటున్నట్లగా (Felt Needs) అయి ఉండగల్గితే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించగల్గుతారు. అయితే ఈ రకమైన హామీలన్నీ ప్రజలందరకు చేరే అన్ని రకములైన చర్యలు

తీసుకోవలసియుంది. అధికార పక్షం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను యండగట్టటంతో సరిపెట్టక, వారికి జనసేన – తెలుగుదేశం బి.జె.పి ప్రభత్వం ఏర్పడితే ప్రజల సంక్షేమం, సౌకర్యార్థం ఏం చేయదలచినారో స్పష్టంగా చెప్పగలగాలి.

3. వై.ఎస్.ఆర్ పార్టీ రాబోయే ఎన్నికలలో ఓటర్లను వివిధ చర్యల ద్వారా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ఈ చర్యలకు ధీటుగా నిలబడగలిగే బలమైన అభ్యర్థులను జనసేన తెలుగుదేశం పార్టీలు ఎన్నికల రంగంలోకి దింపటం ఒక చర్య అయితే వై.ఎస్.ఆర్ పార్టీ వారు యివ్వబోయే

ఆర్థిక లబ్ధి పొందిన ఓటర్లు తమ మనోభావాల ప్రకారమే తమ ఓట్లను యివ్వవలసినదిగా వారిని కోరుతూ ఎక్కువ ప్రచారం చేయటం ద్వారా వారిని చైతన్యవంతులు చేయాలి.

4. ఎలక్షన్ రింగ్ తెలుగుదేశం కార్యకర్తలు, బి.జె.పి కార్యకర్తలు ఎక్కువ అనుభవం కల్గియున్నారు. బూత్ కమిటీల సభ్యుల సహకారంతో బాటు వీరిని కూడ ఎలక్షనీరింగులో ఉపయోగించ వలసియున్నది. ఎన్నికల ప్రధాన అధికారి చర్యలు ప్రకారం వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కాకూడదు. ఎవరైన వాలంటీర్లు ఎన్నికల చర్యల్లో భాగస్వామ్యులైతే వారిపై పోలింగ్ అధికార్లకు కంప్లెంటు చేయటం చాలా అవసరం.

5. వై.ఎస్.ఆర్ పార్టీ వారు సహజంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బి.జె.పి నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. వాటిని తిప్పి కొట్టటంలో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, అధికార ప్రతినిధులు ఏమాత్రం సమయాన్ని వృధా చేయక అటువంటి వారి చర్యలను ఖండించటం అవసరం. జగన్ మోహన్ రెడ్డి అవినీతి చర్యలపై ఎక్కువ ప్రచారం చేయటం ద్వారా ఓటర్లను చైతన్యం చేయటం జరగాలి.

6. అభ్యర్థుల ఎంపికలో జనాభా ప్రాతిపదికన చర్యలు తీసుకోవటం ద్వారా అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయటం ద్వారా సామాజిక న్యాయం పాటించడం జనసేన తెలుగుదేశం పార్టీలకు శ్రేయస్కరం అని సలహా యివ్వటం జరుగుతున్నది.

పైన పేర్కొనబడిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ముందుకు నడిస్తే నేటి ప్రతిపక్ష పక్షాల కూటమి విజయం సాధించటం పెద్ద కష్టమేమి కాబోదు.

– హరి రామ జోగయ్య

Ex. MP & Ex. Home Minister

KAPU SAMKSHEMA SENA

 

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Hari rama jogayyaJanasenaPawan KalyanTdpYsrcp
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.