Pedana Constituency : పెడన సీట్ జనసేనదే..!!
కృష్ణా జిల్లాలో జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పెడన నియోజక వర్గం ఒకటి. 2019 లోనే ఇక్కడ జనసేనపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫలితాలు అంత ఆశాజనకం గా లేకపోయినప్పటికీ జనసేన క్యాడర్ ఎక్కడా నిరుత్సాహ పడక 2024 ఎన్నికల కోసం ముందు నుండీ జనంతో మమేకమౌతూ సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు. ఎలా అయినా 2024 ఎన్నికల్లో ఇక్కడ జనసేన జెండా ఎగరేయలని పట్టుదలగా పనిచేశారు జనసైనికులు. ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా ఎక్కడా తలొగ్గక అధికార పార్టీ అవినీతి అక్రమాలకు ధైర్యంగా ఎదురు నిలబడింది మాత్రం జనసేన మాత్రమే.
Janasena : ఇక్కడ జనసేన విజయం లాంఛనమే..
టీడీపీ అసలు జనంలో ఉందా..?
టీడీపీ తో పొత్తులో వెళుతున్నాం అని అధినేత ప్రకటించిన తరువాత కూడా పెడన సీట్ ఖచ్చితంగా జనసేనదే అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అది న్యాయం కూడా.. ఎందుకు అంటే జోగి MLA అయిన తరువాత టీడీపీ పార్టీ జెండా అసలు ఎక్కడా కనబడిన దాఖలాలు లేవు. ఆ పార్టీ నాయకులు గానీ.. కార్యకర్తలు గానీ నియోజకవర్గం లో ఒక్క కార్యక్రమం చేసింది లేదు. “నాయకులు ఇళ్లలో కూర్చుంటే.. కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టడానికి కూడా భయపడుతున్నారు అనీ.. జనసేన వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళలా ధైర్యంగా పోరాడాలి..” అంటూ టీడీపీ మీటింగ్స్ లోనే చెప్పారు అంటే అక్కడ టీడీపీ పరిస్థితి ని అర్ధం చేసుకోవచ్చు.
టీడీపీ ప్రచారం పై జనసైనికుల గుస్సా..!!
వారాహి యాత్ర లో భాగంగా పవన్ కళ్యాణ్ పెడన రావడం తో నియోజకవర్గం సీట్ జనసేనదే అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. జనసైనికులు కూడా అదే జరుగుతుంది అని ఆశించారు కూడా..అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ నాయకుల తీరు మాత్రం భిన్నంగా ఉంది. టికెట్ మాదే అంటూ హడావుడి మొదలు పెట్టారు. టీడీపీ కి సీట్ కంఫర్మ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. జనసేన కేడర్ మాత్రం టికెట్ ఎవరికిచ్చినా కలసి పని చేసి గెలిపించుకుందాం అని చెబుతున్నా లోపల తీవ్ర అంతర్మధనం తో ఉన్నారు.
పెడన సీట్ జనసేనకు ఇవ్వాల్సిందే..!!
నాలుగేళ్ళ పాటు పని చేసి ఎలక్షన్స్ టైం కి సీట్ టీడీపీకి ఎలా వదులుకుంటాం అంటూ కొందరు బాహాటంగానే చెబుతున్నారు. సీట్ ఎనౌన్స్ చేయక ముందే మీ అతి ఏంటి అసలు..? ఇపుడు సీట్ కావాలి అని తిరుగుతున్న వాళ్ళు ఈ నాలుగేళ్లు ఏమయ్యారు అంటూ మండి పడుతున్నారు. ఏది ఏమైనా పెడన సీట్ జనసేనకు రావాల్సిందే.. ఇన్నాళ్లూ పని చేసి ఇపుడు సీట్ తెలుగుదేశానికి వదిలేదు లేదు. దీనికోసం ఎంత దూరం వెళ్లాడానికైనా సిద్ధమే అంటూ జనసేన నాయకులు.. కార్యకర్తలు తీవ్ర పట్టుదలతో ఉన్నారు.
Discussion about this post