Headspace Founder Story : ఆత్మీయులను కోల్పోయి తీవ్ర దుఃఖంలోకి నెట్టి వేయబడి, తర్వాత సన్యాసంలో చేరి, ఆ కన్నీటి సంద్రం నుంచి తేరుకొని కోట్ల సంపాదనకు అధిపతి అయిన ఓ సన్యాసి కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరు ఆండీ పూడికోంబే.. ఇతను తాగి డ్రైవింగ్ చేసిన ఘటనలో తన స్నేహితులను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కూడా కోల్పోయాడు. ఈ రెండు సంఘటనల నుంచి బయటపడలేక తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత చదువును కొనసాగించలేక కాలేజీ మానేసి నేపాల్ కి వెళ్లిపోయి అక్కడ బౌద్ధం స్వీకరించాడు. బౌద్ధమతం తీసుకున్న తర్వాత ఆసియా అంతటా తిరుగుతూ ధ్యానం, సంపూర్ణత గురించి పూర్తి సమాచారం సేకరించాడు. ఇదే అతని జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆండీ ధ్యానంతో ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చనే సత్యాన్ని తెలుసుకొని అది అందరికీ పంచాలనే ఉద్దేశంతో 2005లో యుకె నుంచి లండన్ కు తిరిగి వచ్చి లండన్ లో ప్రైవేటు ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ఆండీ,రిచర్డ్ పియర్సన్తో కలిసి 2010లో ‘హెడ్స్పేస్‘ (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు. అది తక్కువ కాలంలోనే ఈ యాప్ ఎక్కువ మంది ప్రజాధారణ పొందింది. ఎప్పుడూ కూడా జీవితాన్ని బిజీ,బిజీగా గడిపే వారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా మారింది. ఈ యాప్ ఎంతోమంది ప్రజలకు ధ్యానం యొక్క ప్రయోజనాలను వివరిస్తుంది. మానసిక ఆరోగ్యం గురించి వివరించడంలో ఈ యాప్ విస్తృత ప్రజాదారణ పొందింది.
ఎంతోమంది మానసిక ఒత్తిడి గురయ్యే వారికి ఈ యాప్ వారి జీవితాల్లోని గందరగోలాలను మాయం చేస్తూ అభయహస్తంగా మారింది. ఈ యాప్ ఇప్పుడు 4,00,000 మంది సబ్స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని పొందుతుంది. బౌద్ధ సన్యాసి అయిన ఆండీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడం ఆచ్ఛార్యం. కష్టాలు వస్తే బాధ పడుతూ కూర్చోకుండా వాటినుండి ఎలా అధిగమించాలో ప్రతిఒక్కరు ఆలోచించాలి.