Interesting Fact about BanyanTree : శిక్ష అనేది చేసిన తప్పులను బట్టి నిర్ధారిస్తూ ఉంటారు. అయితే శిక్షలు ఇప్పటివరకు మనుషులే అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు జైలు శిక్ష అనేది చేయని తప్పులకు కూడా మనుషుల అనుభవించి చివరికి నిర్దోషులుగా బయటకు వచ్చిన సందర్భాలు ఎన్నో మనం చూసాం.
అచ్చం అదే తరహాలో ఒక చెట్టు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. చెట్టుకు జైలు శిక్ష ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ! అయినా చెట్టుకు శిక్షలు వేయడం ఏంటి అని ఇంకా మీకు ఆశ్చర్యంగా ఉందా ! కానీ మీరు వింటున్నది నిజమే. ఇక్కడ ఒక చెట్టు చేయని తప్పుకు 125 సంవత్సరాలుగా జైలుశిక్ష అనుభవిస్తుంది.
చేయని తప్పుకు ఓ మర్రి చెట్టును గొలుసులతో బంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 సంవత్సరాలుగా బందీని చేశారు. అన్ని సంవత్సరాలు మర్రిచెట్టును బంధీని చేయవలసిన అవసరం ఏమొచ్చింది.. ఇంతకీ ఆ చెట్టు ఏ ఊర్లో ఉంది.. దాని వెనుక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇన్ని సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న చెట్టు పాకిస్థాన్ లోని లాండికోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంది.
ఆ ప్రాంతంలో ఉన్న మర్రిచెట్టుకే సంకెళ్లు వేసి బంధించారు. ఆ మర్రి చెట్టు దగ్గర “ఐయామ్ అండర్ అరెస్టెడ్డ్” అని బోర్డు కూడా పెట్టి ఉండడం గమనార్హం. ఇంతకీ అ మర్రిచెట్టుని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే.. 1898లో భారతదేశం మొత్తం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ ఆర్మీ అధికారి,
ఓ రోజు బాగా మద్యం సేవించి ఉండగా ఆయనకు ఆ మద్యం మత్తులో ఆ చెట్టు తన వైపు దూసుకువస్తున్నట్టు అనిపించడంతో, ఆయన వెంటనే ఆ మర్రిచెట్టును అరెస్ట్ చేయమని ఆర్డర్లు వేశాడంట. అలా అప్పుడు ఆ చెట్టును సంకెళ్లతో బంధించారు. ఇప్పటివరకు కూడా ఆ సంకెల్లను ఎవరు తొలగించలేదు. ఇంకా చెట్టు శిక్ష అనుభవిస్తూ అలాగే ఉండిపోయింది.