International Kissing Day : ప్రేమ బంధాన్ని కొనసాగించాలంటే ఆ బంధంలో ముద్దు ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఒకరి మీద ప్రేమను వ్యక్తపరచడానికి ముందు ఒక సాధనం లాంటిది. అలాంటి ముద్దును గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కూడా ఒకరోజు ఉంది. అదే ఈరోజు. International Kissing Day. ముద్దు అనేది ఇద్దరి మధ్య ఒక మధురానుభూతి. ఆ ముద్దును వివిధ రకాలుగా ప్రదర్శించవచ్చు.
ముద్దు ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేస్తుంది, కోపాన్ని నిలిపేస్తుంది. ప్రేమను హెచ్చిస్తుంది. అలాంటి ముద్దు ప్రత్యేకతను తెలుపుతూ.. జులై ఆరవ తేదీన ప్రపంచవ్యాప్తంగా International Kissing Day ను జరుపుకుంటారు. మొదటగా ఈ ముద్దు ప్రస్థానం యూకేలో మొదలైంది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాకింది. ముద్దు ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు. ఈ ముద్దు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్దు ఒత్తిడిని తగ్గించే ఒక ఔషధం. ముద్దు పెట్టుకోవడం వల్ల పని ఒత్తిడి, హార్మోల స్థాయిని తగ్గిస్తుంది. పని మెరుగ్గా చేసుకోవడానికి మనసునులో ప్రశాంతతను నింపుతుందని థెరపిస్టులు వెల్లడిస్తున్నారు. ముద్దు పెట్టుకోవడం వల్ల చర్మంపై ఒక ఎక్సర్సైజ్ ల ఉండి, దానివల్ల రక్తప్రసరణ ప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. ముద్దును ఎక్కువసార్లు పెట్టుకోవడం వల్ల చర్మంలో సాగుదల తగ్గిపోయి చర్మం ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే ముద్దు పెట్టుకునే సమయంలో గుండె పనితీరు మెరుగ్గా ఉండడమే కాక రక్త ప్రసరణ అదుపులో ఉంటుంది.
ముద్దు వల్ల మైగ్రేన్, తలనొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంలోని వివిధ రకాల నొప్పులు అన్ని తగ్గుముఖం పడతాయి. ముద్దు పెట్టుకోవడం వల్ల రక్తంలో ఐజీఈ యాంటీబాడీల పరిమాణం పెరగకుండా అదుపులో ఉంటుంది. ఈ యాంటీబాడీలు హిస్టామిన్ స్రావానికి సహాయపడతాయి. అందువల్ల హిస్టామిన్ ప్రతికూల ప్రభావాలకు, ఎలర్జీ సమస్యలకు ముద్దు ఒక మందు.
ముద్దు వల్ల ఊపిరితిత్తుల సమస్య కూడా నిలకడగా ఉంటుంది. ముద్దు తర్వాత ఊపిరితిత్తులు సాధారణం కంటే మూడు రెట్లు మెరుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా శ్వాస వ్యవస్థ మెరుగ్గపని చేస్తుందని అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముద్దు పెట్టుకొనే సమయంలో నోటి శుభ్రత చాలా అవసరం..లేకపోతే నోటికి సంభందించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.