• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

ప్రతిపక్ష నాయకుని స్థాయి దాటలేకపోతున్న జగన్..  

TrendAndhra by TrendAndhra
January 6, 2023
in Special Stories
262 3
0
YS Jagan
515
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు.. అంటే అతి ఏదైనా ప్రమాదమే అని అర్థం.

రాజకీయాల్లో కూడా అంతే విమర్శ సంధర్భోచితం అయితే బాగుంటుంది.అసందర్భంగా, అనుచితంగా పదే పదే చేసిన విమర్శనే చేస్తే చప్పట్లు కొట్టిన వాళ్ళు కూడా చీదరించుకునే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిన విమర్శలనే అధికారంలో ఉండి కూడా వల్లే వేస్తూ ఒకప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళ దగ్గరే ఇప్పుడు విమర్శలు ఎదుర్కుంటున్నారు.

దానికి ప్రత్యక్ష ఉదాహరణ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై ఆయన అదేపనిగా చేస్తున్న వ్యక్తిగత దూషణలు. ఏ ప్రభుత్వమూ ప్రజలందరినీ సంతృప్తి పరిచే స్థాయిలో పని చేయలేదు అన్నది వాస్తవం. పరిస్థితుల దృష్ట్యా కొన్ని విషయాలలో ప్రజాగ్రహానికి గురికావాల్సి రావడం సహజం.దానిపై ప్రతి పక్షాలు గళం ఎత్తడం పరిపాటి.

Also Read: అమాంతం పెరిగిన జనసేన గ్రాఫ్.. “ఈ సారి పవన్ కి చేద్దాం..” ఇదీ జనం లో టాక్..

కానీ ప్రభుత్వం ఆ విమర్శలను ఎలా ఎదుర్కోనే విధానం మీదే పాలకుల పనితీరు తేట తెల్లం అవుతుంది.సరిగ్గా ఈ విషయంలోనే వైఎస్ జగన్ పనితీరులో డొల్లతనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని సామాన్య ప్రజలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.

జనసేనాని సంధించే ప్రతి ప్రశ్నకు సమాధానంగా నాకు ఒక్కత్తే భార్య అని..పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకున్నాడు అని కాబట్టి నన్నే నమ్మండి అంటూ వై ఎస్ జగన్ బహిరంగ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడి స్థాయి నుంచి ముఖ్య మంత్రి స్థాయికి ఎదగలేదు అని చెప్పకనే చెప్తున్నాయి.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విధాన పరమైన విమర్శలకి వ్యక్తిగత దూషణలు చేయడం రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడలేదు అని రాజకీయ పండితులు చెబుతున్నారు.

పవన్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు లేక కనీసం తమ కార్యకర్తలను, పార్టీ సానుభూతి పరులని తృప్తి పరుస్తూ..గత ఎన్నికల్లో చేసిన విమర్శలనే తిరిగి ప్రజల్లోకి తీసుకువెళ్తే చాలన్న అపోహలో వైఎస్ జగన్ చిక్కుకున్నారు అని అనుకుంటున్నారు.

ఒకప్పుడు పవన్ వ్యక్తిగత జీవితంపై, పాకేజ్ అంటూ వై యస్ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థించిన వారే అధికారంలోకి వచ్చాకా కూడా ఇంకా ఇవే విమర్శలా? కార్యకర్తకి ముఖ్యమంత్రికి తేడా లేదా అంటూ పెదవి విరుస్తున్నారు.

మరికొంత మంది పవన్ పాకేజ్ తీసుకున్నది నిజం అయితే అధికారం చేతిలో ఉంచుకుని ఎందుకు ఆధారాలు చూపించడం లేదు అని జన సేన సానుభూతి పరులు, సామాన్య ప్రజలు చేస్తున్న ఎదురు దాడిని తట్టుకోలేక మిన్నకుండి పోతున్నారు.

ఇటీవల మీడియా చర్చల్లోను పవన్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే ప్రధాన విమర్శగా తీసుకున్న అధికార పార్టీ ప్రతినిధులు సైతం జగన్ కి ఒక్కతే భార్య అయితే ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? జగన్ కి ఒక్కతే భార్య అయితే కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి అవ్వలేదు అంటూ ?
జనసేన అధికార ప్రతినిధులు సైతం పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేయడంతో చర్చని పక్కదారి పట్టించడానికి తిప్పలు పడి పరువు పోగొట్టుకుంటున్నారు.

ఏమైనా తన స్థాయిని మర్చిపోయి దిగువ కార్యకర్త లా వైఎస్ జగన్ చేస్తున్న వ్యక్తిగత దూషణలను బట్టి ఆయనకు ముఖ్యమంత్రికి కావాల్సిన పరిపక్వత రాలేదు అని అటు రాజకీయ విమర్శకులు,సామాన్య ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండగా.. గాల్లో కేబుల్స్ వేలాడదీస్తే కేబుల్ బ్రిడ్జి అయిపోదు..ముఖ్యమంత్రి అని నేమ్ బోర్డ్ పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఐపోరు అని జనసేన శ్రేణులు ఘాటుగా విమర్శిస్తున్నారు.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Jagan comments on pawan KalyanJanasena NewsJanasenani Pawan KalyanLatest News TeluguLatest Telugu NewsLatest Telugu News in ApLatest Telugu News in TelanganaLatest Telugu News OnlineLive Telugu NewsTelugu Breaking NewsTelugu Trending NewsTrend AndhraTrend Andhra NewsTrending News in TeluguYS Jagan Latest News
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.