Kanna Laxmi Narayana : కన్నా రిజైన్… మారుస్తుందా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ వ్యవస్థాగత డిజైన్ ?
కన్నా కన్ను ఎటు వైపు ?
కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా అంశం అధికారికమైనంతనే.. ఆయన ఏపార్టీలో చేరతారన్న దానిపై ఊహాగానాలే కాదు.. ఆయన పోటీ చేసే సీటు మీదా ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన కన్నా.. తాను ఏ పార్టీ లో చేరతారన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ నెట్టింట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కన్నాకు కాపుసామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది.. ఆయనకు అనుచర బలం కూడా భారీగానే ఉంది కాబట్టి తెలుగు దేశం కన్నా ని పార్టీలోకి అహ్వానిస్తే కాపుసామాజిక వర్గం ఓటు బ్యాంక్ తెలుగు దేశానికి లాభం చేకూర్చే ఆంశం, ఇదే సూత్రం జనసేనకు వర్తించినా ఆయన చూపు టీడీపీ మీదనే ఉందంటున్నారు. ఆయన కోరుకున్నట్లుగా ఎన్నికల్లో టికెట్ లభించటం ఖాయమంటున్నారు. నరసరావుపేట,సత్తెన పల్లి గుంటూరు వెస్ట్ ఈ మూడిటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని కొందరు అంచనాలు వేస్తుంటే.. అదేమీ కాదని ఆయన్ను లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది.

కౌంటర్ ప్లాన్ రెడీ :
అయితే గత కొంతకాలంగా ఊహించిందే అయినా.. ఎన్నికల ముందు వరకు కన్నా బీజేపీ లోనే కొనసాగుతారని అంచనా వేశారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కన్నా అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. అయితే బయట వారి సంగతి ఎలా ఉన్నా.. పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ముందే కాన్నా రాజీనామాను పసిగట్టునట్టు ఉన్నారు. అందుకే కన్నా రాజీనామా చేసిన రోజునే కాపు నేతలతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఎందుకంటే కన్నాకు కాపుసామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది.. ఆయనకు అనుచర బలం కూడా భారీగానే ఉంది. కేవలం గుంటూరు జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సామాజికి వర్గంలో కన్నాకు ఓ ఇమేజ్ ఉంది. అయితే ఆయన పార్టీకి దూరం అయితే.. ఆ సామాజికి వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు.. కేడర్ కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందని ముందే బీజేపీ అలర్ట్ అయ్యింది. అందుకే వెంటనే కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ ని వ్వవస్దాగత మార్పులతో రీ డిజైన్ చెయ్యాలి :
బీజేపీ కి రిజైన్ చేశాక కన్నా మాట్లాడుతూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారిందన్నారు. ఆయన పార్టీని తన సొంత సంస్థలా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పార్టీలో ఇక తాను ఏ మాత్రం ఇమడలేకపోతున్నాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కన్నా లక్ష్మీ నారాయణ…ఈ వ్యాఖ్యలు లోకల్ నాయకులు ఆధిష్టానానికి ఇచ్చిన సమాచారం తప్పుదోవ పట్టించేది గా వుందని.. పరిస్దితిని చక్కదిద్దాల్సిన సమయం కాబట్టి బి.జె.పి పార్టీ పెద్దలను ఆలోచనలో పడేసాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పార్టీ అంత చురుకుగా లేదు. అప్పుడప్పుడు మీడియా సమావేశాలు తప్ప కార్యాచరణ పై దృష్టి లేదు . పురంధరీశ్వర్రి లాంటి ఆనుభమున్న వారి సేవలను పూర్తి స్దాయిలో వినియోగించుకోవడం లేదు. పొత్తులపై ఆశలతో ఉహాజనిత అశావాహ ధోరణిలో వుంది. పొత్తులు అటూ ఇటూ అయితే బి.జె.పి సాధించే సీట్లు తక్కువ. కాబట్టి ఇప్పటికైనా పార్టీ పరిస్దితి పై శ్రద్దపెట్టి నాయకులను సమన్వయపరచి ఆనుభమున్న వారి సేవలను వియోగించుకుని మహిళలకు , యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా సర్దుబాటు చర్యలు తగిన మరమ్మత్తు లు చేయాల్సిన ఆవసరం వుంది.
Also Read : జగన్ స్టికర్స్.. ముందు ముందు పచ్చ బొట్లే అని ట్రోలింగ్..
– శ్రీధర్ వాడవల్లి, హైదరాబాదు
