Lunar Zone : ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 వల్ల చంద్రుడి ప్రస్తావన ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. అయితే చాలామంది చంద్రుడిపై నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అది సాధ్యమేనా దానివల్ల భూమికంటే చంద్రుడు సేఫ్ హ.. కాదా.. తెలుసుకుందాం. మనకు భూకంపాలు తెలుసు. భూమిపై ఏదో ఒక ప్రాంతంలో అవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. ప్రకృతిలో జరిగే విపత్తులలో భూకంపాలు కూడా ఒకటి భూకంపాలు వచ్చినప్పుడు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అధికంగా ఉంటుంది.
అయితే భూమి కంటే కూడా చంద్రమండలము ఇంకా డేంజర్ అనే చెప్తున్నారు. అంతరిక్ష పరిశోధకులు అక్కడి భూకంప తీవ్రత భూమిపై వచ్చిన దానికంటే 20 రెట్లు అధికంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీని కారణాలు వారి మాటల్లో.. చంద్రుడి భౌగోళిక నిర్మాణం భూమి కంటే ప్రత్యేకంగానే ఉంటుంది. అయినా అక్కడ భూకంపాలు వస్తాయని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కోసారి వాటి తీవ్రత 20 కంటే ఎక్కువగా ఉంటుందంటే ఆలోచించండి.
విక్రమ్ ల్యాండర్ అక్కడ భూకంపం సంబంధించిన సంకేతాలను గుర్తించిందని పరిశోధకులు వెల్లడించారు. అమెరికా చేపట్టిన అపోలో 17 ప్రాజెక్టులో చంద్రుడి పైకి వెళ్ళిన వ్యోమగాములు అక్కడ కొన్ని సిస్మోమిటర్లు వదిలి వచ్చారు. చంద్రుడి పై భూకంపాలకు సంబంధించిన సమాచారానంత అది సేకరిస్తుంది. ఆ ఐదేళ్ల కాలంలో చంద్రుడుపై సుమారు 12 వేలకు పైగా భూకంపాలు భూ ప్రకంపనలు సంభవించినట్లు నాసా వెళ్లలించడం గమనార్హం.
చంద్రుడిపై నాలుగు రకాల భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని సిస్మోమీటర్లు వెల్లడించాయి . ఆ నాలుగింటిలో ఒకటి లోతైన భూకంపం, రెండోది తేలికపాటి భూకంపం, మూడోది నిస్సార భూకంపం, నాలుగోది థర్మల్ భూకంపం.. ఇవి చంద్రమండల ఉపరితలంపై 700 కిలోమీటర్ల లోతు వరకు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. చంద్రుడిపై ఉల్కలు ఢీ కొనడం, ఉపరితలంపై ఉష్ణోగ్రతలలో మార్పులు తదితర కారణాల వల్ల భూకంపాలు సంభవిస్తాయని వివరించారు. తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 పాయింట్లుగా నమోదైందని, ఈ భూకంపాలు 10 సెకన్ల నుంచి 30 సెకన్లు ఉంటాయని తెలిపారు. మరికొన్ని రెండు నిమిషాల పాటు కొనసాగుతాయని వారు వివరించారు.