Mansa Musa : ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే వెంటనే మనం గుక్క తిప్పుకోకుండా ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ అని వీళ్ళ పేర్లు చెప్పేస్తాం. అయితే వీరందరికంటే ముందే ఈ భూమిపై అత్యంత సంపన్నుడైన వ్యక్తి జీవించాడని మీకు తెలుసా.. ఆ వ్యక్తి ఎవరు.. ఆ సంపద అతనికి ఎలా వచ్చింది.. ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాం.
కొన్ని నివేదికల ప్రకారం 14వ శతాబ్దంలో ఆఫ్రికన్ చక్రవర్తి అయిన “మన్స ముస” అనే వ్యక్తి ఈ భూమిపై అత్యంత సంపన్నుడిగా వెలుగొందాడు. అయితే ఇతడి గురించి ఎక్కువగా ప్రచారం జరగకపోవడం గమనార్హం. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ సంపన్నుడు 1287AD లో జన్మించినట్లు, పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన మాలి సామ్రాజ్యానికి 1312 AD రాజుగా పరిపాలన కొనసాగించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈయన సంపద విలువ 400 మిలియన్ డాలర్లని అంచనా వేశారు.
అంటే ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం చూసుకుంటే రూపాయలు 30 లక్షల కోట్ల కంటే పైచిలుకే. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆ కాలంలోనే అంత సంపాదించాడు ఈ రాజు అంటే ఆశ్చర్యం కాక ఇంకేం అవుతాము. మాన్స మూసా సంపద ఆయన వనరులు ప్రస్తుతం మన ప్రపంచ కుబేరుల సంపదతో పోల్చుకుంటే రెట్టింపు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎలాన్ మాస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు కాగా, జెఫ్ బెజోస్ సంపద 150 బిలియన్ మిలియన్ డాలర్లు.
ఈ లెక్కన మూసా సంపద రెట్టింపు అవుతుంది. అయితే అప్పట్లో ఆ దేశ వనరులు ఉప్పు, బంగారం. చరిత్రకారుల వెల్లడించిన ప్రకారం హజ్ తీర్థయాత్ర కోసం మాలి నుంచి మక్కాకు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ప్రయాణం సాగించిన అతి తక్కువ మందిలో మూసా ఒకరని వారు వెల్లడించారు. అప్పట్లోనే ఈ మార్గంలో వందకు పైగా ఒంటెలు, భారీ మొత్తంలో బంగారం, 12,000 మంది సేవకులు, 8,000 మంది అనుచరులను మూసా తన వెంట తీసుకువెళ్లాడని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
మూసా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజు మాత్రమే కాదు. దాతృత్వానికి ఇతడు ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఇతనిని “కింగ్ ఆఫ్ కింగ్స్” అనే పేరుతో ప్రజలు పిలుచుకునేవాళ్ళు. తన దగ్గర ఉన్నటువంటి సంపదను, బంగారాన్ని తన రాజ్య ప్రజలకు ఈ రాజు విరివిగా పంచిపెట్టేవాడు. మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేసిన ఘనత పొందిందని చరిత్రకారులు చెబుతున్నారు.