Melbourne : ఈమధ్య ఆస్ట్రేలియాలో ఒక లోహపు ఆకృతి హల్ చల్ చేసింది. అందరూ ఇది ఎక్కడి నుంచి వచ్చి పడి ఉంటుంది.. దీని ఆకారం చూస్తే ఇప్పటిదానిలాగా లేదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో చరిత్ర ఉంది అని ఆ విషయాన్ని వైరల్ చేసేసారు. ఈ నేపథ్యంలో ఈ లోకపు ఆకృతి 20 ఏళ్ల నాటి భారత రాకెట్ కు సంబంధించిన శఖలమై ఉండొచ్చని అంతరిక్ష నిపుణులు ఒక అంచనా వేశారు.
ఈ లోహపు ఆకృతి ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ రేవు వద్ద దర్శనమిచ్చింది. దీని గురించి పూర్తి వివరాల కోసం ఆస్ట్రేలియా రోదసి సంస్థను భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇస్రో ను సంప్రదించవలసిందిగా వెల్లడించింది. బహుశా ఉపగ్రహ ప్రయోగ సమయంలో ఇది వాహననౌకనుంచి విడిపోయి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఇంకా దీనిపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని వారు వెల్లడించారు.
చూడడానికి ఆ లోహపు ఆకృతి రాగి రంగులో, పెద్ద సిలిండర్ ఆకారంలో ఒకవైపు దెబ్బతిని ఉంది. దానినిండా నత్త గుల్లలు ఉన్నాయి. అదంతా గమనిస్తే అది చాలా కాలం క్రితందని అర్థమవుతుంది. చాలా కాలం నుండి నీటిలోనే అలా ఉండిపోవడం వల్ల అది క్రమంగా తీరానికి కొట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ శకలం యొక్క ఆకృతి ,పరిణామాన్ని బట్టి అది
భారత రాకెట్ కు సంబంధించిన ఎగువదశ ఇంజన్ భాగమై ఉంటుందని ఐరోపా అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇంజనీర్ ఆండ్రియా బాయ్డ్ విశ్లేషించినట్లు ఆస్ట్రేలియా బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. మొదట ఈ శకలం వల్ల ప్రమాదం ఉండవచ్చని స్థానిక పోలీసులు అక్కడ ప్రకటించారు. కానీ రసాయన విశ్లేషణ తర్వాత శాస్త్రవేత్తలు ఎలాంటి ముప్పు లేదని వెల్లడిస్తూ, 2019లో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీఏ, సి46 రాకెట్ లో ఇది ఒక భాగమై ఉండవచ్చని వారు వివరించారు.