Rare Sword : భారతదేశంలో పురావస్తు వారి తవ్వకాలు నిర్వహించినప్పుడు ఎన్నో అద్భుత కళాఖండాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి మనుషుల మేధస్సు కంటే పూర్వం మనుషుల మేదస్సు ఎంతో ప్రతిభావంతమైనది. అని చెప్పటానికి కొన్ని వస్తువులు నిదర్శనాలుగా నిలిచాయి. అయితే ఈ మధ్యకాలంలో పరిశోధనలో భాగంగా జరిగిన తవ్వకాల్లో నాటి మానవుడి మేధస్సుకు నిదర్శనంగా అద్భుతమైన నిర్మాణాలు, వస్తువులు బయటపడ్డాయి.
వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది, ఆకర్షవంతమైనది,ఆశ్చర్యాన్ని కలిపించే ఒక ఖడ్గం బయటపడింది. ఈ ఘటన జర్మనీలో వెలుగు చూసింది. గత వారం క్రితం పురావస్తు శాఖవాళ్లు తవ్వకాలు జరిపిన నార్డ్లింగెన్ అనే చిన్న పట్టణంలో అత్యంత అరుదైన ఖడ్గం బయటపడింది. వారి అంచనా ప్రకారం ఇది 3000 సంవత్సరాల క్రితం కాంస్య యుగం నాటి అష్టభుజి ఖడ్గంగా గుర్తించారు. ఇంకో విచిత్రము ఏమిటంటే సమాధిలో ఈ ఖడ్గంతో పాటే మరో ముగ్గురు వ్యక్తుల ఆనవాలు కూడా లభ్యమయ్యాయి.
ఆశ్చర్యాన్ని కలిపించే విధంగా సమాధిలో ఉన్నా ఈ ఖడ్గం చెక్కుచెదరకుండా ఇప్పటికీ తల,తలా మెరుస్తూ వారికి కనిపించింది. శాస్త్రవేత్తలే ఈ ఖడ్గం యొక్క మెరుపును చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఖడ్గం 14వ శతాబ్దము BEC నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే వాస్తవానికి 3300 బీసీ నుండి 12 బీసీ వరకు ఉన్న సమయాన్ని కాంస్య యుగం అని పిలుస్తారు. సమాదిలో లభించిన మూడు మృతదేహాల
ఆనవాళ్లు ఒక పురుషుడు ఒక స్త్రీ వారితోపాటు ఒక యుక్త వయసుకి సంబంధించిన వ్యక్తిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇంకా వివరాల కోసం సమాధిని మరింత లోతుగా తవ్వి పరిశీలించాల్సిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఖడ్గం కాంస్య,రాగి రెండు లోహాలతో కలిసి ఆకుపచ్చ రంగును కలిగి ఉంది. రాగి ఒక ప్రత్యేకమైన రంగుగా ఆక్సీకరణం చెందింది. ఖడ్గం వాడిన ఆడవాళ్లు శాస్త్రవేత్తలకు కనిపించలేదు.
ఒకవేళ ఈ ఖడ్గాన్ని ఆచార సాంప్రదాయాలను అనుసరించడం కోసం తయారుచేసి ఉండవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఖడ్గం యొక్క భాగాలు దక్షిణ జర్మనీ, ఉత్తర జర్మనీ, డెన్మార్కు లలో విడివిడిగా తయారు చేపించబడి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా పరిశోధిస్తే అసలు విషయాలు వెలుగులోకి రావచ్చని వారు అంటున్నారు.