Stone House : సమాజంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. ఒక్కొక్కరు తమ ఇల్లును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. కొందరు ఇంటికోసం ఎన్నో ప్రత్యేకతలు తీసుకుంటారు. ఇల్లును చాలా సుందరంగా కనిపించేలా చేయడానికి కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడుగు వేయరు. ఒక వ్యక్తి యొక్క ప్రెస్టేజ్ అతను నివసించే ఇంటిలో ఉంటుందని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.
ఇల్లు ఎంత గొప్పగా ఉంటే సమాజంలో అతని గుర్తింపు కూడా అంతే గొప్పగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే కొన్ని ఇల్లులు చూడడానికి చాలా విచిత్రంగా, ఆకర్షనీయంగా, సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. కొంతమంది ఇల్లులను ప్రకృతితో మమేకమై కట్టుకుంటూ ఉంటారు. ఆ ఇంటిలోనే సంతోషాన్ని వెతుక్కోని ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తారు.
ఈ కోవలోకి చెందిందే పోర్చుగల్ లోని ఒక రాతి ఇల్లు. రాతి ఇల్లు అనగానే అది ఎప్పుడో రాతియుగం కాలంనాటిది అనుకుంటే పొరపాటే. ఈ రాతి ఇల్లు ఇప్పటి ఆధునిక కాలంలో నిర్మించబడినదే. ఈ రాతి ఇల్లును ఒక ఇంజనీర్ 1972 లో తన ఫామ్ హౌస్ లాగా నిర్మించుకున్నాడు. దానికోసం కొండ ప్రాంతంలో ఒక భారీ శిలను తొలచి ఇల్లులాగా నిర్మించాడు.
అయితే కాలక్రమమైన ఈ విచిత్రమైన ఇంటిని చూడడానికి జనాలు ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. దానితో ఆ యజమాని వాళ్ళ తాకిడిని భరించలేక వేరేచోట తన ఫామ్ హౌస్ నిర్మించుకొని వెళ్ళిపోయాడు. వెళ్లేముందు ఈ రాతి ఇంటిలోని ఫర్నిచర్ ని మొత్తం అలాగే వదిలి వెళ్లాడు. దాంతో ఆ రాతి ఇంటిని మ్యూజియం గా పోర్చుగల్ పర్యాటక శాఖ వారు మార్చారు. అప్పటినుండి అది ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారిపోయింది.