Strange Custom : పెళ్లిలో అమ్మాయి తరపువారు అబ్బాయి తరపు వారికి కట్నం ఇస్తారని తెలుసు. ఆ కట్నం డబ్బులు, బంగారం, కారు ,ఆస్తులు ఇలాంటి రూపంలో ఉంటుంది. దీంట్లో వింత ఏముంది.. ఇది అందరికీ తెలిసిన విషయమే అంటారు కదా.. కానీ ఒక దగ్గర మాత్రం అల్లుడికి కట్నంగా పాములను ఇస్తారు. పాములా వాటినేం చేసుకుంటారు.. అయినా కట్నంగా ఇవ్వడం ఏంటి.. అని మీకు ఆచ్ఛార్యం కలగవచ్చు.
కానీ నిజమే అల్లుడికి కట్నంగా పాములను ఇచ్చే ఆచారం కూడా ఇంకా అమలులో ఉంది. అది ఎక్కడ.. దాని వెనుక గల కథ ఏంటో తెలుసుకుందాం.. ఛత్తీస్‌ఘడ్‌లో ఒక గిరిజన తెగ ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వీళ్ళు కోర్బా ప్రాంతానికి చెందిన సన్వారా గిరిజన తెగ. అయితే వీరు తమ బిడ్డలకు వివాహం చేసినప్పుడు అల్లుడికి కట్నం గా పాములు ఇస్తారు. ఈ ఆచారాన్ని వారు కొన్ని వందల సంవత్సరాలుగా పాటిస్తున్నారు.
సన్వారా తెగవారు పెళ్లి జరిగేటప్పుడు వరుడుకి పాములను కట్నంగా ఇస్తారు. అలా అని ఒకటి రెండు పాములు అనుకుంటే తప్పే.. వీరు ఏకంగా తొమ్మిది రకాల జాతలకు చెందిన 21 పాములను అల్లుడికి కట్నంగా ఇచ్చుకుంటారు. ఇక్కడ మరో వింత విషయం ఏమిటంటే ఈ సన్వారతెగలో తల్లిదండ్రులు కట్నంగా పాములు ఇవ్వకపోతే ఆ ఆడపిల్లను ఎవరు కూడా పెళ్లి చేసుకోరు.
ఈ ఆచారం ఇప్పటిది కాదని తమ పూర్వికులు కూడా ఈ ఆచారాన్ని పాటించేవారని వారు 60 పాములను కట్నంగా ఇచ్చే వారిని కాలక్రమంగా ఈ ఆచారం సాగుతూ వస్తుందని గిరిజనులు తెలుపుతున్నారు. గిరిజన తెగకు వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆచారాన్ని, కట్టుబాటును నష్టం కలిగించ వద్దని అక్కడి చత్తీస్గడ్ ప్రభుత్వం కూడా ఆచారానికి అడ్డు చెప్పలేదు.