Temple of Divorce : దేవాలయాలు ఎందుకు ఉంటాయి? భక్తులు ఆ భగవంతుడిని కొలుచుకోవడానికి, భగవంతుని సన్నిధిలో గడపడానికి కదా.. కానీ ఒక దేవాలయం మాత్రం విడాకులు కోసం ప్రత్యేకంగా ఉంది.. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది వాస్తవం. ఈ గుడికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండడం విశేషం. ఈ ఆలయం జపాన్ లో ఉంది. దీని పేరు మాస్తుగావోకా టోకీజీ ఆలయం. ఈ ఆలయాన్ని విడాకుల గుడి లేక డైవర్స్ టెంపుల్ అని పిలుస్తుంటారు.
ఈ ఆలయం 12 ,13 శతాబ్దంలో జపాన్ సమాజంలో చాలా గుర్తింపు పొందింది. విడాకుల విషయంలో మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రం అప్పట్లో ఉండేవి కాదు. స్త్రీలకు వివాహం జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉన్న అలాగే అనుభవిస్తూ ఉండేవాళ్ళు. కానీ పురుషులు అలా కాదు వారు విడాకులు తీసుకోవడానికి పూర్తి స్వతంత్రులు. మహిళలపై ఇలాంటి సామాజిక కట్టుబాట్లు చాలా ఉండేవి. అలా భర్త విడాకులు ఇస్తే ఆ స్త్రీ చాలా నిస్సహాయురాలుగా సమాజంలో బ్రతికేది.
ఆ సమయంలోనే అలాంటి వారికి అండగా 1285లో కాకుసాన్ షిదోని అని బౌద్ధ బిక్షువు ఈ ఆలయాన్ని నిర్మించి, ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రంగా మార్చారు. షిధోని మరణించిన తన భర్త జ్ఞాపకార్థం కోసం ఈ ఆలయాన్ని నిర్మించింది. బౌద్ధ మందిరంగా పేరుందిన ఈ ఆలయంలో పెళ్లయి విడాకులైన ఒంటరి మహిళలు, పెళ్లి తర్వాత చిత్రవధలు అనుభవించేవారు ఆశ్రయం పొందేవారు. సమాజంలో పెళ్లి తర్వాత విడిపోయే జంటల కోసం, విడాకుల వ్యవహారాలు ఈ ఆలయంలో జరిగేవి.
అక్కడ విడాకులు తీసుకున్న వారికి ధ్రువపత్రాలను అందించేవారు. ఈ యొక్క పత్రాలు మహిళలు ఒంటరిగా, స్వేచ్ఛగా, జీవించడానికి హక్కుగా ఉపయోగపడేవి. 1873లో జపాన్ మహిళలు విడాకులు తీసుకోవడానికి కొన్ని చట్టాలు ఈ ఆలయంలో ప్రవేశపెట్టారు. ఈ ఆలయం జపాన్ యొక్క పురోగతికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ ఆలయానికి వచ్చే వారు తమ విడాకుల విషయాన్ని ఒక పేపర్ పైన రాసి ఆలయంలోని టాయిలెట్లలో వేసి ప్లస్ చేస్తారు.
ఈ ఆలయంలో అలనాటి కళాకృతులు కనిపిస్తాయి. అప్పటి మహిళలు ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపే ఆనవాళ్లు చాలానే అక్కడ దర్శనమిస్తాయి. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు కూడా ఇక్కడ జరిగేవి. ఇప్పటికి కూడా బౌద్ద బిక్షువులు, నన్ లు ఆలయానికి వచ్చే వారికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు.